ఆ టెక్‌ కంపెనీల సంగతేంటో చూడండి..!
close

తాజా వార్తలు

Updated : 17/03/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ టెక్‌ కంపెనీల సంగతేంటో చూడండి..!

 షీజిన్‌పింగ్‌ ఆదేశాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఈ సారి టెక్‌ కంపెనీలపై దృష్టిపెట్టారు. సామాజిక స్థిరత్వాన్ని సాధించేందుకు టెక్‌ కంపెనీల నిబంధనలను మరింత పటిష్ఠం చేయాలని ఆయన సోమవారం జరిగిన ఓ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని షినూహా పత్రిక పేర్కొంది. ప్లాట్‌ఫామ్‌ కంపెనీలు సామాజిక స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. చైనాలో ఆన్‌లైన్‌ ఆధారిత సేవలు అందించే కంపెనీలను ప్లాట్‌ఫామ్‌లుగా పేర్కొంటారు.

ఇంటర్నెట్‌ రంగంలోని కంపెనీలకు సంబంధించిన నిబంధనలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని షీజిన్‌పింగ్ అధికారులకు చెప్పారు. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిబంధనల ప్రకారమే జరిగేట్లు చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏ కంపెనీ పేరును ప్రస్తావించలేదు. వాస్తవానికి ఈ కొత్త నిబంధనలు వస్తే జాక్‌మాకు చెందిన ‘యాంట్‌గ్రూప్’‌ కష్టాలు మరింత పెరగనున్నాయి. డిజిటల్‌ ఎకానమీలో మోసాలు జరగకుండా చూడటమే తమ అత్యున్నత ప్రాధాన్యాంశమని గతంలో కూడా షీజిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

గతంలో జాక్‌మా బ్యాంకింగ్‌‌ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయన జాక్‌మాకు గుణపాఠం నేర్పాలని నిర్ణయించారు. ‘యాంట్‌గ్రూప్’‌ ఐపీవోకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందే కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే కారణం చూపుతూ చైనా అధికారులు అడ్డుకొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని