Corona: రోడ్డుపై తిరుగుతున్న యముడు, భటులు
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: రోడ్డుపై తిరుగుతున్న యముడు, భటులు

హిందూపురం: కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా మాస్కు ధరించాలంటూ హిందూపురం పోలీసులు వినూత్న అవగాహన కల్పించారు. యోగి నారాయణ సేవాసమితి సహకారంతో యముడు, యమ భటుల వేషధారణతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్కు ధరించకపోతే ఎదురయ్యే అనర్థాలను వివరించారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. లేదంటే కరోనా మహమ్మారి బారిన పడతారని హెచ్చరించేలా ఈ కార్యక్రమం సాగింది. ‘నేను యముడిని. మాస్కు పెట్టుకోకుంటే వస్తా.. మీరు ఇంట్లో ఉంటే నేను బయట ఉంటా. బయటకు వస్తే మీ వెంటే ఉంటా..’ అంటూ  యముడి వేషధారణలో ఉన్న వ్యక్తి హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, రేపటి నుంచి కర్ఫ్యూ అమలు కానుండటంతో అనవసరంగా బయట తిరిగితే కేసులు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని