అదృశ్యమైన యానాం అభ్యర్థి కాకినాడలో ప్రత్యక్షం
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదృశ్యమైన యానాం అభ్యర్థి కాకినాడలో ప్రత్యక్షం


అపస్మారక స్థితిలో ఉన్న పెమ్మాడి దుర్గాప్రసాద్‌

యానాం, న్యూస్‌టుడే: యానాం శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్‌ మూడు రోజుల క్రితం అదృశ్యమై ఆదివారం రాత్రి కాకినాడలో ప్రత్యక్షమయ్యారు. అచ్చంపేట కూడలి వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దుర్గాప్రసాద్‌ను అంబులెన్స్‌ వైద్య సిబ్బంది గమనించి ఆసుపత్రిలో చేర్చారు. స్పృహ లేకపోవడంతో ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి అదృశ్యం కావడం పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అభ్యర్థి అపహరణకు గురయ్యాడని, ఇందులో ప్రధాన రాజకీయ పార్టీల నేతల పాత్ర ఉందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో చర్చనీయాంశమైంది. ఈ కేసును పుదుచ్చేరి నుంచి వచ్చిన సీనియర్‌ ఎస్పీ రాహుల్‌ ఆల్వాల్‌ ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. యానాం పట్టణంలోని అన్యం గార్డెన్‌లోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న దుర్గాప్రసాద్‌ స్థానిక భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. భాజపా టిక్కెటు కోసం ప్రయత్నించారు. ఎన్డీయే కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్‌.రంగసామి యానాం నుంచి పోటీకి దిగడంతో స్వతంత్ర అభ్యర్థిగా దుర్గాప్రసాద్‌ పోటీకి దిగారు. క్రమశిక్షణ కింద ఆయన్ని భాజపా నాయకత్వం సస్పెండ్‌ చేసింది. గత గురువారం ఉదయం బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో అతని భార్య శాంతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని స్పృహలోకి వచ్చిన తర్వాత దుర్గాప్రసాద్‌ చెప్పినట్లు తెలిసింది.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని