close
Array ( ) 1

తాజా వార్తలు

ఎస్‌ఈసీ లేఖతో వైకాపాకేంటి ఇబ్బంది: యనమల

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌కే భద్రత లేనప్పుడు ఇక ఎన్నికలకు భద్రత ఎక్కడిదని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ ప్రాణాలకే ముప్పు తెచ్చి ఎన్నికలు నిర్వహించుకోవాలనే ధోరణిలో సీఎం జగన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో మీడియాతో యనమల మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో తనకున్న ఇబ్బందుల గురించి ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తే వైకాపాకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేంద్ర బలగాలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అధికార వైకాపాకు డిపాజిట్లు కూడా రావనేది ఆ పార్టీ భయమని ఆయన విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు రీ ఎలక్షన్ కోరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజారోగ్యంపై ప్రతి గంటకు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారని.. ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఏపీ ప్రభుత్వ వింత పోకడలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని యనమల ఆక్షేపించారు.

వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి సమర్థించుకోవడం ప్రభుత్వ అజెండాగా మారిందని యనమల విమర్శించారు. ఎస్‌ఈసీపై ఎక్కడా లేని అక్కసు వెల్లగక్కిన జగన్‌ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి చివాట్లు తిన్నారని దుయ్యబట్టారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే సీఎం జగన్‌కు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకంటే దౌర్జన్యాలతో ఎన్నికల నిర్వహణే ముఖ్యమన్నట్లు జగన్‌ వ్యవహరిస్తున్నారని యనమల మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా దౌర్జన్యాలు, ఆకృత్యాలు, ఉల్లంఘనలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.