జ‌గ‌న్ బాధ్య‌తారాహిత్య‌మే చేటు: య‌న‌మ‌ల‌
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జ‌గ‌న్ బాధ్య‌తారాహిత్య‌మే చేటు: య‌న‌మ‌ల‌

అమ‌రావ‌తి: కొవిడ్ రెండో ద‌శ‌లో ఏపీ ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చు, ఆదాయాల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని తెదేపా సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు డిమాండ్ చేశారు. తొలిద‌శ‌లో ఏపీ ఆర్థిక వృద్ధిరేటు 4.3 శాతానికి ప‌డిపోయింద‌న్నారు. క‌రోనా రెండో ద‌శ‌లో ఏపీలో తిరోగ‌మ‌న వృద్ధి ఖాయమ‌ని చెప్పారు. క‌రోనా క‌న్నా జ‌గ‌న్ బాధ్య‌తారాహిత్య‌మే ఏపీకి చేటు చేసింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అభివృద్ధికి గండికొట్టి.. పేద‌ల ఉపాధి, రాబ‌డుల‌ను చావు దెబ్బ తీశార‌న్నారు. ద్ర‌వ్య‌లోటు, అధిక అప్పులే జ‌గ‌న్ ఘ‌న‌త అని ఎద్దేవా చేశారు. తిరోగ‌మ‌న పాల‌కుడిగా జ‌గ‌న్ పేరు రికార్డుల్లో నిలిచిపోతుంద‌ని య‌న‌మ‌ల అన్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని