close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120036957 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => zm1r0-PUUfA [video_short_link] => zm1r0-PUUfA [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-17 16:13:16.175409 [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120036957 [video_srlno] => 2 [video_type] => 1 [video_link] => 86RePb__Yoo [video_short_link] => 86RePb__Yoo [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-17 16:13:16.233491 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

మళ్లీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలి: యనమల

అమరావతి: రాష్ట్రంలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని, ఈసారి కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని భాజపా కూడా డిమాండ్ చేస్తున్నందున  కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే ధోరణి మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

‘‘కరోనాపై ముఖ్యమంత్రి తేలిగ్గా మాట్లాడుతున్నారు. రాజ్యాంగ పరమైన వ్యవస్థను అవమానించేలా మాట్లాడటం సరికాదు. ముఖ్యమంత్రి ఏవిధంగా స్పందించారో... దానికి అనుకూలంగానే సీఎస్‌ లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ అంతా ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుంది’’ అని యనమల వివరించారు.  

టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు కరోనాపై మాట్లాడిన మాటలతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌... ఈసీపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. వైకాపాలో ఏ కులానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో బహిర్గతం చేస్తాం.. చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్‌ విసిరారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు సంబంధం లేదని రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ సమాజం గురించి తెలుసుకుని వ్యవహారశైలి మార్చుకోవాలని సూచించారు. ప్రపంచం మొత్తం కరోనా అప్రమత్తత గురించి మాట్లాడుతుంటే  జగన్‌ ఒక్కరే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

 




Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.