ఒక్కడే వచ్చాడు.. 100 మిలియన్‌ వ్యూస్‌ దాటేశాడు!
close

తాజా వార్తలు

Updated : 10/01/2021 04:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కడే వచ్చాడు.. 100 మిలియన్‌ వ్యూస్‌ దాటేశాడు!

హైదరాబాద్‌: ‘గ్యాంగ్‌లతో వచ్చేవాడు గ్యాంగ్‌స్టర్‌.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్‌స్టర్‌’.. ‘కేజీయఫ్‌-1’లో ఈ ఒక్క డైలాగ్‌ చాలు రాకీ పాత్రను ఏ స్థాయిలో హైలైట్‌ చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే కరెక్ట్‌ అని మరోసారి రాకీభాయ్‌ నిరూపించాడు. యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో రికార్డులు బద్దలు కొడుతోంది. గురువారం రాత్రి టీజర్‌ను విడుదల చేయగా, అతి తక్కువ సమయంలో 100 మిలియన్‌ వ్యూస్‌ను దాటి దూసుకుపోతోంది. 5 మిలియన్లకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో టాప్‌లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, కథానాయకుడు యశ్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘పవర్‌ఫుల్‌ పీపుల్‌ మేక్‌ ప్లేసెస్‌ పవర్‌ఫుల్‌: కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

చాప్టర్‌-1లో మిగిలిన అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీయఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీయఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీర ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవీ చదవండి..

సంక్రాంతి సినీ ట్రైలర్ల హంగామా

‘కేజీయఫ్‌2’లో నా పాత్ర అలా ఉంటుంది: రవీనా
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని