close

తాజా వార్తలు

Published : 06/03/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

75 సంవత్సరాలే అన్నారు..ఇప్పుడేది?

శ్రీధరన్‌ ఎంపికపై విమర్శలు

దిల్లీ: మెట్రోమ్యాన్‌ ఈ శ్రీధరన్‌(88)ను కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా భాజపాను ప్రశ్నించారు. 75 సంవత్సరాల నిబంధన ఎటుపోయిందంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడానికి భాజపా ఎంత దూరమైనా వెళ్తుందని తీవ్రంగా మండిపడ్డారు. 

ఈ మేరకు యశ్వంత్ సిన్హా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘88 ఏళ్ల శ్రీధరన్..కేరళలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి. మరి 75 ఏళ్ల నిబంధన ఎటుపోయింది. భాజపా అధికారం కోసం ఎంతదూరమైనా వెళ్తుంది’ అని ఆయన దుయ్యబట్టారు. 

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘విజయ్ యాత్ర’లో భాగంగా భాజపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ మాట్లాడుతూ.. శ్రీధరన్ సాధించిన విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. పాలరివట్టం ప్రాజెక్టు పునర్నిర్మాణాన్ని ఆయన నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పూర్తిచేశారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొనే ఆయనవైపు మొగ్గుచూపామని తెలిపారు. ఇదిలా ఉండగా.. భాజపా 75 సంవత్సరాల నిబంధనతో పార్టీలోని చాలామంది సీనియర్లను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కొందరికి టికెట్‌ ఇవ్వకపోవడానికి దీనినే కారణంగా చూపింది. ఆ జాబితాలో ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి భాజపా కురువృద్ధులు కూడా ఉన్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని