విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర
close

తాజా వార్తలు

Updated : 20/02/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర

విశాఖ కార్పొరేషన్‌ : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ గేటు వరకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు పార్లమెంట్‌లోనూ పోరాడతామన్నారు. 

‘విశాఖ ఉక్కుని ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలి. ప్రైవేటీకరణ చేయకూడదనే వైకాపా విధివిధానాలను అనుసరించి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని ప్రారంభించాం.. పోరాటాన్ని అలాగే కొనసాగిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైకాపా ఒప్పుకోదు. విశాఖ ఉక్కును సాధించినప్పుడు పోరాటం రాష్ట్రంతో పాటు దిల్లీలో కూడా జరిగింది. అలాగే పోరాటం చేస్తే అనుకున్నది సాధిస్తాం’ అని విజయసాయిరెడ్డి అన్నారు. 

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఒప్పుకోమని ఇటీవల విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి కార్మిక సంఘాలను కలిసినప్పుడు స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ మేము కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. పార్లమెంటు లోపల, బయటా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు అవసరమైన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందించింది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని