చంద్రబాబు రాజీనామా చేయాలి: పెద్దిరెడ్డి
close

తాజా వార్తలు

Updated : 18/02/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబు రాజీనామా చేయాలి: పెద్దిరెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ కుప్పంలోనే కూలిపోయే పరిస్థితికి వచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైకాపాకే దక్కాయని ఆయన లెక్కలు చెప్పారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నియోజకవర్గంలోనూ మెజార్టీ స్థానాలను తామే దక్కించుకున్నామన్నారు. ‘మూడో విడతలో 2,574 సర్పంచి స్థానాలు వైకాపాకు దక్కాయి. తెదేపా 509 స్థానాల్లో గెలుపొందింది. కుప్పంలో ఉన్న 89 సర్పంచి స్థానాల్లో వైకాపా 75 సర్పంచి స్థానాలను కైవసం చేసుకుంది. తెదేపా కేవలం 14 స్థానాల్లోనే విజయం సాధించింది. తనపై తీవ్ర విమర్శలు చేసిన తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేయాలి’ అని పెద్దిరెడ్డి అన్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రిగా కాకుండా.. ఒకసారి ప్రధానమంత్రి కావాలని.. అది తన కోరిక అని వివరించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని