close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/05/2020 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పోకిరి’ అంటే చాలా ఇష్టం.

లవర్‌బాయ్‌గా తనకంటూ క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు విజయ్‌దేవరకొండ. రౌడీస్‌ అంటూ అభిమానుల్ని ఇష్టంగా పిలుచుకునే విజయ్‌ తన ఇష్టాయిష్టాలను చెబుతున్నాడిలా...


ఇష్టపడే సినిమా

ప్పుడు పూరీతో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ... నాకు ముందునుంచీ ‘పోకిరి’ అంటే చాలా ఇష్టం.


అభిమానించే నటులు

నాకు రణ్‌బీర్‌కపూర్‌ నటన ఎంతో నచ్చుతుంది. అలాగే కొంతకాలం దీపికా పడుకొణె నటనను అభిమానించేవాడిని. ఇప్పుడు ఆలియాభట్‌ అంటే ఇష్టం. ఆమె చేసిన ‘రాజీ’, ‘గల్లీబాయ్‌’ చూశాక ఎంత సూపర్‌గా చేస్తుందో అనిపిస్తుంది.


టైంపాస్‌ అంటే...

టైంపాస్‌ కావడానికి పుస్తకాలు చదువుతా. ఆ మధ్య మోస్సాడ్‌ అనే పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టా. తరువాత ట్యూజ్‌డేస్‌ విత్‌ మోరీ ఒకటి... అయితే అన్నీ పది పేజీల చొప్పున చదివి, పక్కన పెట్టేసి మరొకటి తీసుకుంటా. వాటన్నింటినీ ఎప్పుడో ఒకప్పుడు పూర్తిచేయాలి. ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలో ఆ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘శాంతారం’ అనే పుస్తకం చదవమన్నాడు. కొని ఉంచా కానీ అది చాలా పెద్దగా ఉంది. ఏదో ఒక రోజు మొదలుపెట్టాలి.


బిర్యానీ అంటే ఇష్టం!

నేను వ్యాయామం పెద్దగా చేయను కానీ... ఆహారం విషయంలో మాత్రం చాలా శ్రద్ధ పెడతా. నా ఆహరంలో చక్కెర అసలు ఉండదు. ఎవరికైనా చక్కెర తీసుకోవద్దనే చెబుతా. అయితే హైదరాబాదీ దమ్‌ బిర్యానీని చూస్తే మాత్రం ఇష్టంగా లాగించేస్తా.


మొదటి ప్రాధాన్యం వారికే...

జీవితంలో మా అమ్మా, నాన్నా, తమ్ముడికే మొదటి ప్రాధాన్యం ఇస్తా వాళ్ల ముందు నేను నటుడిని కాదు. సాధారణ విజయ్‌ లేదా చిన్ను అంతే. అందుకే ఏ మాత్రం తీరిక దొరికినా వాళ్లతో గడిపేందుకే ఇష్టపడతా. వాళ్ల తరువాత నా స్కూల్‌ఫ్రెండ్స్‌. వాళ్లు నన్ను డీవీఎస్‌ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం న్యూఇయర్‌ని ఆ ఫ్రెండ్స్‌తో కలిసి చేసుకోవడమే ఇష్టం. నేనెప్పుడు ఫ్రీగా ఉన్నా, వాళ్లూ మా ఇంటికొస్తారు.


ప్రేమంటే...

నా దృష్టిలో అదో అద్భుతమైన ఫీలింగ్‌. దానికోసం ప్రత్యేకంగా ప్రేమికుల దినోత్సవం అవసరంలేదు. ఎప్పుడైనా ఆ ఫీలింగ్‌ని ఆనందించొచ్చనేది నా భావన. నా అడ్రెస్‌ ఎవరికీ తెలియదు కానీ... వాచ్‌మెన్‌కి లవ్‌లెటర్లు ఇచ్చేసి వెళ్లిపోతుంటారు చాలామంది. వాటన్నింటినీ పూర్తిగా చదువుతా. అలా చదవడం ఎందుకో బాగుంటుంది.


నచ్చే ప్రాంతం

లానా అని లేదు కానీ... ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రాంతం ఏదయినా నచ్చుతుంది. ‘వరల్డ్‌ఫేమస్‌ లవర్‌’కోసం ప్యారిస్‌లో షూటింగ్‌ చేశాం. ఎండా చలీ మరీ విపరీతంగా లేవు. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి చోట్ల ఎన్ని గంటలైనా ఉండిపోవచ్చు. అదే విధంగా ముంబయి. నేల, సముద్రం పక్కపక్కన కనిపిస్తోంటే... అలా చూస్తూ ఉండిపోవాలని ఉంటుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.