ఇది తాగితే..కరోనా రాదు నాన్నా!
close

తాజా వార్తలు

Published : 11/09/2020 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది తాగితే..కరోనా రాదు నాన్నా!

కొవిడ్‌ మందు పేరుతో తండ్రికి పురుగుమందు ఇచ్చి.. తానూ తాగిన యువకుడు
కుమారుడి మృతి.. చావుబతుకుల మధ్య ఇంటిపెద్ద

పంజాగుట్ట: కొవిడ్‌ కారణంగా వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడటం కష్టమని భావించిన యువకుడు చనిపోవడమే పరిష్కారమనుకున్నాడు. తాను చనిపోతే తల్లిదండ్రులు బతకలేరని భావించి వారినీ తనతోపాటు తీసుకెళ్లాలనుకున్నాడు. కరోనా మందుగా నమ్మించి పురుగుమందు తాగించాడు. ఈ ఘటనలో కుమారుడు మృతిచెందగా..తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రమంజిల్‌ హిల్‌టాప్‌ కాలనీలో ఆలంపాటి అనీష్‌రెడ్డి(35) తల్లిదండ్రులు ఆలంపాటి రామిరెడ్డి (61), శ్రావణిరెడ్డిలతో కలిసి నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అనీష్‌రెడ్డి కరోనాకు మందు తెచ్చానంటూ తల్లిదండ్రులను నిద్రలేపాడు. మూడు గ్లాసుల్లో పురుగుల మందు కలిపాడు. తొలుత దాన్ని తండ్రికి ఇచ్చి, తర్వాత తానూ తాగాడు. వంటగదిలోనికి వెళ్లిన తల్లి వచ్చేలోపే ఇద్దరూ వాంతులు చేసుకోవడంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. ఇద్దర్నీ సోమాజిగూడలోని కార్పొరేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఎక్కువ మోతాదులో పురుగుమందు తీసుకున్న కారణంగా అనీష్‌రెడ్డి కాసేపటికే మరణించాడు. రాంరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ‘అనీష్‌రెడ్డి పలు ఐటీ కంపెనీలకు భోజనం సరఫరా చేస్తుంటాడు. కొంతకాలంగా కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడం, వ్యాపారం ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని ఉంటాడని’ తల్లి పంజాగుట్ట పోలీసులకు వివరించారు. పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని