ఎవరూ స్పందించక... ప్రాణం పోయింది..!
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 08:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరూ స్పందించక... ప్రాణం పోయింది..!


గుర్తుతెలియని యువకుడి మృతదేహం

తాడేపల్లి, న్యూస్‌టుడే: అవసరమైన సమయంలో స్థానికులు ఎవరూ స్పందించక..అంబులెన్స్‌ సిబ్బందికి సహకరించక..ఓ కుర్రాడి ప్రాణం గాలిలో కలిసి పోయింది. ఈ హృదయ విదారక సంఘటన ఆదివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో గుర్తు తెలియని యువకుడు (25) దగ్గుతూ కుంచనపల్లి అండర్‌ ప్రాసెస్‌ సమీపంలో తిరుగుతున్నాడు. అతను శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం ఇవ్వగా వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. ఎవరైనా యువకుడి వెంట వస్తే వైద్యశాలకు తీసుకువెళతామని వారు కోరారు. స్థానికులెవరూ ముందుకు రాలేదు. పలుసార్లు పలువురిని అడిగినా ఎవరూ స్పందించ లేదు. దీనితో అంబులెన్స్‌ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఆ యువకుడు మృతిచెంది పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఏలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని ఖననం చేసేందుకు మున్సిపల్‌ సిబ్బందికి అప్పగించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని