ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 26/10/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య

మహదేవపూర్‌: నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అంటూ ప్రేమించిన అమ్మాయి మృతిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహదేవపూర్‌ గ్రామానికి చెందిన చల్లా మహేశ్‌(24) టీఎస్‌ఎండీసీ (తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌)లో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఈ నేపథ్యంలో చల్లా మహేశ్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రోజువారీ విధుల్లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేశ్‌‌.. ఆదివారం ఉదయం యువతి సమాధి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు లేనిలోకంలో ఉండలేనంటూ ఆత్మహత్య చేసుకునే ముందు వాట్సప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. 

ఈ స్టేటస్‌ చూసిన స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూసేసరికే మహేశ్‌ మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న మహదేవ‌పూర్‌ ఎస్సై అనిల్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన అమ్మాయి మృతి చెందడాన్ని తట్టుకోలేక తన కుమారుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని