తోడబుట్టిన వారినే తెగనరికాడు
close

తాజా వార్తలు

Updated : 07/03/2021 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తోడబుట్టిన వారినే తెగనరికాడు

శ్రీకాకుళం జిల్లాలో ఘోరం

రణస్థలం: ఆస్తి వివాదంతో ఓ వ్యక్తి తోడబుట్టిన వారినే తెగనరికాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గ్రామానికి చెందిన సన్యాసిరావు ఎప్పటిలాగే ఈ రోజు ఉదయం పశువుల శాలలో పాలు తీస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన తమ్ముడు రామకృష్ణ కత్తితో నరికాడు. సమీపంలో ఉన్న అక్క జయమ్మ ఆందోళనతో అక్కడికి రాగా.. ఆమె పైనా వేటు వేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతోపాటు అందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని