ఆస్తి కోసం అన్నను హత్యచేసిన తమ్ముళ్లు
close

తాజా వార్తలు

Published : 05/03/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్తి కోసం అన్నను హత్యచేసిన తమ్ముళ్లు

శంకర్‌పల్లి(మున్సిపాలిటీ): ఆస్తి కోసం తమ్ముళ్లు ఇద్దరూ కలిసి ఎకంగా రక్తం పంచుకుని పుట్టిన అన్ననే చంపేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టంగుటూరు గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు యాదయ్య, పాండు, శ్రీనివాస్‌ మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వారిలో పెద్దవాడైన యాదయ్యతో తమ్ముళ్లిద్దరు ఘర్షణకు దిగారు. గొడవ తారస్థాయికి చేరడంతో పాండు, శ్రీనివాస్‌ కలిసి అన్న యాదయ్యను కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం పాండు, శ్రీనివాస్‌ శంకర్‌పల్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపీనాథ్ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని