ఆ గ్రామంలో యువతకు పెళ్లి కావట్లేదు..
close

తాజా వార్తలు

Published : 20/02/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ గ్రామంలో యువతకు పెళ్లి కావట్లేదు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ గ్రామంలో యువతకు పెళ్లి కలగానే మిగిలిపోతోంది. ఎందుకని? ఏమైనా ఆరోగ్య సమస్యలా? అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. రవాణా సదుపాయాలు లేని కారణంగానే ఆ ఊరితో ఎవరూ చుట్టరికం కలుపుకుందామనుకోవడం లేదు. బిహార్‌లోని తారాబడి గ్రామం.. పశ్చిమబెంగాల్, బిహార్‌ సరిహద్దుల్లో ఉంటుంది. దాదాపు 800 మంది వరకు ఇక్కడ ముస్లిం జనాభా ఉంది. ఊరు చుట్టూ నదులే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనీస సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వాగ్దానాలు చేసినప్పటికీ తారాబడి గ్రామం మాత్రం అందుకు నోచుకోలేదు. దీంతో ఆ గ్రామంలోని యువతని వివాహం చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వారు సైతం అనాసక్తి కనబరుస్తున్నారు. తమ బందువుల ఇళ్లకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. రాజకీయ నాయకులు తరచూ నమ్మబలుకుతూ.. తమ గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగ్దానాలు ఎన్నో చేసినా కనీసం ఒక్క వంతెన నిర్మించలేదని వాపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని