వివేకా హత్య.. విమర్శలపై విజయమ్మ లేఖ
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 05:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివేకా హత్య.. విమర్శలపై విజయమ్మ లేఖ

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో కచ్చితంగా గుర్తించి శిక్షించాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ డిమాండ్‌ చేశారు. ఇది తనతో సహా సీఎం జగన్‌, షర్మిల మాట అని.. దీనిలో ఎవరికీ రెండు అభిప్రాయాలు లేవన్నారు. హత్య కేసు దర్యాప్తు విషయంలో కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తల పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయమ్మ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. 

సీబీఐ దర్యాప్తు కేంద్రం పరిధిలోనిదని.. ఇందులో ఏపీ ప్రభుత్వం చేయగలిగేది ఏముందని విజయమ్మ ప్రశ్నించారు. తిరుపతి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. వివేకాను హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షించాలనే వివేకా కుమార్తె సునీత డిమాండ్ చేస్తున్నారని.. ఇదే తమ కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయమని చెప్పారు. ఈ విషయంలో తమ మద్దతు సునీతకు ఉందని ఆమె స్పష్టం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని