
తాజా వార్తలు
క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన వైకాపా అభ్యర్థి
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రలోభాలకు తెరలేపారు. 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైకాపా నుంచి పోటీ చేస్తున్న సురేశ్.. యువ ఓటర్లను ఆకర్షించేలా క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. తన కార్యాలయంలోనే కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఆయన.. ఓటర్ల జాబితా ప్రకారం బ్యాట్లు, ఇతర క్రికెట్ సామగ్రి అందజేశారు. బహిరంగంగానే కిట్లు పంపిణీ చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :