Raghurama: మండలి రద్దు ప్రక్రియ చేపట్టాలి

తాజా వార్తలు

Published : 22/06/2021 15:52 IST

Raghurama: మండలి రద్దు ప్రక్రియ చేపట్టాలి

కేంద్ర మంత్రులకు లేఖ రాసిన ఎంపీ రఘురామ

దిల్లీ: కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రహ్లాద్‌ జోషికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియను వెంటనే చేపట్టాలని లేఖలో కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల దృష్ట్యా లేఖ రాస్తున్నట్లు చెప్పారు. 2020 జనవరి 27న అసెంబ్లీలో మండలి రద్దుకు తీర్మానం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. మండలి రద్దుకు ఎంపీలు కృషి చేయాలంటూ 2020 సెప్టెంబర్‌ 14న సీఎం ఆదేశించినట్లు తెలిపారు. సీఎం, పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించేలా ఏపీమండలి రద్దు చేయాలని తాను కోరుతున్నట్లు రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం పెట్టాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని