IPL:ఆ వార్త వినగానే  వెళ్లిపోవాలనుకున్నా!
close

తాజా వార్తలు

Published : 22/05/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL:ఆ వార్త వినగానే  వెళ్లిపోవాలనుకున్నా!

(photo:Yuzvendra Chahal Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌:  బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటంతో ఐపీఎల్‌-14ను వాయిదావేస్తున్నట్లు బీసీసీఐ మే 4న ప్రకటించింది. ఒకవేళ, ఐపీఎల్ వాయిదా పడకపోయినా.. ఈ లీగ్ నుంచి విరామం తీసుకోవాలని భావించినట్లు టీమిండియా మణికట్టు మాంత్రికుడు, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ తాజాగా పేర్కొన్నాడు. లీగ్‌ జరుగుతున్న సమయంలో తన తల్లిదండ్రులు కరోనా బారినపడిన విషయం తెలిసిన తర్వాత  ఆటపై దృష్టి పెట్టలేకపోయానని,  అందుకే ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలనే ఆలోచన  చేసినట్లు చాహల్  వెల్లడించాడు.

‘నా తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారనే వార్త వినగానే  ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలనుకున్నా. ఇలాంటి సమయంలో వారు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆటపై దృష్టిపెట్టడం చాలా కష్టం. మే 3న వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తర్వాత ఒకట్రెండు రోజులకు ఐపీఎల్ వాయిదా పడింది’ అని చాహల్ చెప్పాడు.

చాహల్ తల్లి సునీతా దేవి కొవిడ్ నుంచి కోలుకోగా..తండ్రి కేకే చాహల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను గుర్గావ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం అక్కడి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.

‘నాన్న ఆక్సిజన్‌ లెవల్స్ 85-86కి పడిపోయాయి. దీంతో వెంటనే ఆయనను  ఆస్పత్రికి తరలించాం. నిన్ననే(గురువారం) డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చాం. ఐతే, ప్రస్తుతం ఆయన ఆక్సిజన్‌ లెవల్స్‌  95-96 మధ్య ఉంటున్నాయి. ఇది మాకు చాలా ఉపశమనం కలిగించే అంశం. కోలుకోవడానికి మరో 7-10 రోజులు పడుతుంది’ అని యూజీ వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని