భారత్-ఇంగ్లాండ్‌ రెండో సెమీస్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) ఫైనల్‌కు టీమ్‌ఇండియా చేరింది. రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 68 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన 171/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. కుల్‌దీప్, అక్షర్ చెరో మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. శనివారం ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో టైటిల్‌ కోసం టీమ్‌ఇండియా తలపడనుంది.

Updated : 28 Jun 2024 01:34 IST