PBKS vs RR: పంజాబ్‌పై అద్భుత విజయం.. నిలిచిన రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు!

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (50), దేవదత్ పడిక్కల్ (51), షిమ్రోన్ హెట్మయెర్ (46) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. రబాడ 2.. సామ్ కరన్, అర్ష్‌దీప్‌ సింగ్, నాథన్‌ ఎల్లిస్, రాహుల్ చాహర్‌ తలో వికెట్‌ తీశారు. దీంతో తమ ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పంజాబ్ ఇంటిముఖం పట్టింది. బెంగళూరు, ముంబయి తమ చివరి మ్యాచుల్లో ఓడితే రాజస్థాన్‌కు అవకాశం దక్కుతుంది.

Updated : 19 May 2023 23:33 IST