close

10% కోటాకు రాష్ట్రపతి ఆమోదం 

103వ రాజ్యాంగ సవరణగా గుర్తింపు

ఈనాడు, దిల్లీ: జనరల్‌ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టరూపం సంతరించుకొంది. దీనిపై శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టంగా మారింది. 124వ రాజ్యాంగసవరణ బిల్లుగా పార్లమెంటు ఆమోదం పొందిన ఈ అంశం రాష్ట్రపతి ఆమోదముద్రతో 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం సంతరించుకొంది. రిజర్వేషన్ల కల్పన కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరించాల్సి వచ్చింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నదానిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీచేయాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారుచేస్తూ ఆ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నుంచి ఇది కార్యరూపంలోకి వస్తుంది. రూ.8లక్షల వరకు వార్షికాదాయం, అయిదు ఎకరాల్లోపు భూమి, వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇల్లు, నోటిఫై చేసిన ప్రాంతాల్లో 100 చదరపు గజాల్లోపు, నోటిఫై చేయని ప్రాంతాల్లో 200 గజాల్లోపు స్థలం ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ కోటా ఉపయోగించుకోవడానికి అర్హత పొందాయి. ఆ విధివిధానాలను అధికారికంగా ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.