close

ఇక్రిశాట్‌లో చిరుత!

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ వ్యవసాయరంగ పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌) ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. దాని అడుగుజాడలను గుర్తించిన గస్తీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ అటవీశాఖకు సమాచారం అందించడంతో, రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతంలో ఇప్పటికే రెండు బోనులతో పాటు సీసీ కెమెరాలు అమర్చారు. రాత్రి సమయాల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలు నమోదయ్యాయని వెల్లడించారు. పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.