close

పోలవరం మరో ముందడుగు 

డీపీఆర్‌-2కు సాంకేతిక సలహా కమిటీ పచ్చజెండా 
రూ.55,548 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. సవరించిన అంచనాలతో రూపొందించిన ప్రాజెక్టు రెండో నివేదిక (డీపీఆర్‌)కు సోమవారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. 2017-18 ధరల ప్రకారం భూసేకరణ, పునరావాస వ్యయం కలిపి ఈ ప్రాజెక్టుకు రూ.55,548.87 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కేంద్రం నుంచి ఈ నిధులు మంజూరు కావాలంటే తొలుత టీఏసీ ఆమోదం తప్పనిసరి. డీపీఆర్‌-2కు టీఏసీ ఆమోదం తెలపడం ఈ ప్రాజెక్టులో కీలక ఘట్టమని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు అభివర్ణించారు. అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆమోదంతో ఈ దస్త్రం కేంద్ర ఆర్థిక శాఖకు చేరుతుంది. అక్కడ ఆమోద ప్రక్రియ మొదలవుతుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.