
ఆకలి తీర్చడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎనలేనిది బృందావన్: పిల్లలు పుష్టిగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందనీ... వారిని శక్తిమంతులుగా, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం తక్షణావసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘అక్షయపాత్ర’ 300 కోట్లవ భోజనాన్ని వడ్డించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేద బడిపిల్లలకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. కొందరికి భోజనం తినిపించారు కూడా. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు వడ్డనలో ప్రధానికి సాయపడ్డారు. మోదీ మాట్లాడుతూ- ‘‘గత 55 నెలలుగా మాతాశిశు ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం గట్టి కృషి చేస్తోంది. టీకాల కార్యక్రమాన్ని శ్రద్ధతో చేపడుతోంది. చిన్నారులందరికి కడుపు నిండా నాణ్యమైన ఆహారాన్ని అందించడం కూడా ఎంతో అవసరం. ఇందుకు అక్షయపాత్ర చేస్తున్న కృషి అనల్పం. ఏమాత్రం ఆలోచించకుండా చేసేదే శుద్ధ దానమవుతుందనీ, అక్షయపాత్ర అదే చేస్తోందని ప్రధాని కొనియాడారు. ఈ సంస్థలో వంటచేసేవారు, వడ్డించేవారంతా దేశానికి ఎంతో మేలు చేస్తున్నారు. ‘నేను’ నుంచి ‘మనం’, ‘సమాజం’ అన్న భావనకు మన ఆలోచనలు విస్తృతమైననాడు... ‘మన’ కోసం కంటే దేశానికి, సంస్కృతికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. చమురు ధరలు అందుబాటులో ఉండాలి
‘అక్షయపాత్ర’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
ముఖ్యాంశాలు

దేవతార్చన
- పది కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకుని..
- తండ్రి కారు కింద చితికిపోయిన చిన్నారి
- ‘రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు..చంపేయండి’
- కన్నబిడ్డ వివాహమైన కాసేపటికే
- ఉగ్రదాడిని ఖండిస్తూనే.. చైనా వక్రబుద్ధి
- 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారు
- ప్రేమ వ్యవహారమే కారణమా?
- మేడమ్.. నా పిల్లలకు తల్లి ఉంది
- ఆస్ట్రేలియా సిరీస్‌కు కేఎల్ రాహుల్
- పుల్వామా దాడి గురించి ముందే హెచ్చరించారా?