close

ప్రధానాంశాలు

తెదేపా ఏపీ అభ్యర్థుల మలి జాబితా

లోక్‌సభ బరిలో... 

ఈనాడు, అమరావతి: లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సోమవారం అర్ధరాత్రి దాటాక తెదేపా విడుదల చేసింది. మొత్తం 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది. పది మంది సిట్టింగ్‌ ఎంపీలకు అవే స్థానాలు దక్కాయి. జాబితాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, నలుగురు కేంద్ర మాజీ మంత్రులున్నారు. రాజమహేంద్రవరం, అనంతపురంలో ప్రస్తుతం ఎంపీల వారసులకు టికెట్లు కేటాయించారు. జాబితాలో ఇద్దరు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. నలుగురు ఎస్సీలు, అయిదుగురు బీసీలు, ఒక ఎస్టీకి సీట్లు లభించాయి. ప్రస్తుత సభలో సభ్యులుగా ఉన్న కె.రామ్మోహన్‌నాయుడు, అశోక గజపతిరాజు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు, శ్రీరామ్‌ మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు సిట్టింగ్‌ స్థానాల నుంచే మరోసారి బరిలో దిగనున్నారు. రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కోడలు రూప ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వారసుడిగా ఆయన  కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి టికెట్‌ దక్కింది.  విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు అనకాపల్లి స్థానం లభించింది. 
నలుగురు మాజీ కేంద్ర మంత్రులకు సీట్లు 
కాంగ్రెస్‌ నుంచి ఇటీవల పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి కర్నూలు, వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌కి అరకు, పనబాక లక్ష్మికి తిరుపతి లోక్‌సభ టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు విజయనగరం నుంచే రంగంలో నిలిచారు. చలమలశెట్టి సునీల్‌కి కాకినాడ లోక్‌సభ స్థానం సీటు లభించింది.  
లోక్‌సభ స్థానాల్లో ఇద్దరు మంత్రులు పోటీ 
ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు. కడప నుంచి మంత్రి సీహెచ్‌ ఆదినారాయణరెడ్డికి సీటు గతంలోనే ఖరారైంది. ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. దర్శి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు లోక్‌సభ నుంచి బరిలోకి దిగనున్నారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుకి నర్సాపురం లభించింది. 
చివరి క్షణం వరకు చర్చలు 
కొన్ని లోక్‌సభ స్థానాల విషయంలో చివరి క్షణం వరకు తెదేపా అగ్రనేతల మధ్య చర్చలు, సంప్రదింపులు సాగాయి. తొలుత తాడికొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కి బాపట్ల సీటు కేటాయించారు. అక్కడి సిట్టింగ్‌ ఎంపీ మాల్యాద్రికి తాడికొండ శాసనసభ స్థానం ఇచ్చారు. దీనిపై వీరిద్దరు సుముఖత చూపలేదు. దీంతో చివరికి ఎవరి స్థానాల్ని వారికే కేటాయించారు. అమలాపురం స్థానానికి చివరి దాకా హర్షకుమార్‌ పేరే వినిపించింది. ఆఖర్లో దివంగత మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడైన హరీష్‌కే అవకాశమిచ్చారు. విశాఖపట్నం స్థానం ఎంపిక సైతం హైడ్రామా మధ్య దివంగత మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి మనవనికి దక్కింది. తొలుత దీనికి మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు, ఆ తర్వాత మాజీ ఎంపీ సబ్బం హరి పేరు పరిశీలించారు. చివరికి విశాఖపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోకి శాసనసభ అభ్యర్థులంతా భరత్‌ వైపు మొగ్గుచూపటంతో చంద్రబాబు సైతం అంగీకరించారు. నరసరావుపేటకి తొలుత రాయపాటి సాంబశివరావు పేరున్నా, సోమవారం ఉదయం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేరు వినిపించింది. తెనాలి నుంచి ఆయనను మార్చటం ఇబ్బందికరం అవుతుందని గుంటూరు లోక్‌సభ అభ్యర్థి జయదేవ్‌ గట్టిగా చెప్పటంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ని అక్కడే కొనసాగించి రాయపాటికే నరసరావుపేట కేటాయించారు.  
లోక్‌సభ స్థానం అభ్యర్ధి 
శ్రీకాకుళం కె.రామ్మోహన్‌నాయుడు 
విజయనగరం అశోక గజపతిరాజు 
విశాఖపట్నం భరత్‌ 
అనకాపల్లి అడారి ఆనంద్‌  
అరకు(ఎస్టీ) వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ 
కాకినాడ చలమలశెట్టి సునీల్‌ 
అమలాపురం(ఎస్సీ) గంటి హరీష్‌ 
రాజమహేంద్రవరం మాగంటి రూప 
నర్సాపురం వేటుకూరి వెంకట  
శివరామరాజు 
ఏలూరు మాగంటి బాబు 
మచిలీపట్నం కొనకళ్ల నారాయణ 
విజయవాడ కేశినేని వెంకటేశ్వర్లు  
గుంటూరు గల్లా జయదేవ్‌ 
నరసరావుపేట రాయపాటి సాంబశివరావు 
బాపట్ల(ఎస్సీ) శ్రీరామ్‌ మాల్యాద్రి 
ఒంగోలు శిద్దా రాఘవరావు 
కడప సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి 
నెల్లూరు బీదా మస్తాన్‌రావు 
నంద్యాల ఎం.శివానందరెడ్డి 
కర్నూలు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి 
రాజంపేట డీకే సత్యప్రభ 
అనంతపురం జేసీ పవన్‌కుమార్‌రెడ్డి 
హిందూపురం నిమ్మల కిష్టప్ప 
తిరుపతి(ఎస్సీ) పనబాక లక్ష్మి 
చిత్తూరు(ఎస్సీ) ఎన్‌.శివప్రసాద్‌

శాసనసభకు...

ఈనాడు, అమరావతి: తెదేపా చివరి విడతగా మిగిలిన 36 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో విడుదల చేసింది. తొలి జాబితాపై వచ్చిన స్పందననూ పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పుచేర్పులు చేసింది. లోక్‌సభ స్థానాలకు ఎంపికలనుబట్టి అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో ఈ మార్పుచేర్పులు ఉన్నాయి. విజయనగరం, శింగనమల, కదిరి, పోలవరం, కర్నూలు తదితర స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న మీసాల గీత, యామినీబాల, చాంద్‌బాషా, మొడియం శ్రీనివాసరావు, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వలేదు. వారి స్థానంలో వేరే వారికి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది. ఉండి నియోజకవర్గం నుంచి తొలి జాబితాలో అభ్యర్థిగా ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని తెదేపా నిర్ణయించింది. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థులను మార్చాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో శింగనమలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీబాలకు సీటు దక్కలేదు. కల్యాణదుర్గంలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరికి టికెట్‌ కేటాయించలేదు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెదేపా వీడి వైకాపాలో చేరారు. ఈ స్థానం నుంచి అజీజ్‌ పోటీ చేస్తారని సోమవారం నెల్లూరులో జరిగిన సభలో చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం కోసం ఎంపీ టీజీ వెంకటేశ్‌ కుమారుడు భరత్‌, ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ పడ్డారు. చివరకు భరత్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీనిచ్చారు. శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖరరెడ్డిని తెదేపా ఎంపిక చేసింది. అయితే భార్య అనారోగ్య సమస్యల కారణంతో తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఇక్కడినుంచి ఏవీ సుబ్బారెడ్డిని నిలపాలని తెదేపా నిర్ణయించింది. తుది నిర్ణయం ప్రకటించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికే నంద్యాల స్థానం దక్కింది. ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. భూమా కుటుంబంలో ఇద్దరికి సీట్లు దక్కాయి. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ అశోకగజపతిరాజు కుమార్తె అదితి పోటీ చేయనున్నారు.  
1. నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామినాయుడు 
2. విజయనగరం అదితి గజపతిరాజు 
3. భీమిలి సబ్బం హరి 
4. గాజువాక పల్లా శ్రీనివాసరావు 
5. చోడవరం కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు 
6. మాడుగల గవిరెడ్డి రామానాయుడు 
7. పెందుర్తి బండారు సత్యనారాయణ మూర్తి 
8. అమలాపురం అయితాబత్తుల ఆనందరావు 
9. నిడదవోలు బూరుగుపల్లి శేషారావు 
10. నర్సాపురం బండారు మాధవనాయుడు 
11. పోలవరం బొరగం శ్రీనివాసరావు 
12. తాడికొండ తెనాలి శ్రావణ్‌కుమార్‌ 
13. బాపట్ల అన్నం సతీష్‌ ప్రభాకర్‌ 
14. నరసరావుపేట డాక్టర్‌ అరవింద్‌ బాబు 
15. మాచర్ల అంజిరెడ్డి 
16. దర్శి కదిరి బాబురావు 
17. కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 
18. కావలి విష్ణువర్ధన్‌రెడ్డి 
19. నెల్లూరు రూరల్‌ అబ్దుల్‌ అజీజ్‌ 
20. వెంకటగిరి కె.రామకృష్ణ 
21. ఉదయగిరి బొల్లినేని రామారావు 
22. కడప అమీర్‌బాబు 
23. రైల్వేకోడూరు నర్సింహ ప్రసాద్‌ 
24. ప్రొద్దుటూరు లింగారెడ్డి 
25. కర్నూలు టీజీ భరత్‌ 
26. నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి 
27. కోడుమూరు బి.రామాంజనేయులు 
28. గుంతకల్లు ఆర్‌.జితేంద్రగౌడ్‌ 
29. శింగనమల బండారు శ్రావణి 
30. అనంతపురంఅర్బన్‌ ప్రభాకర్‌ చౌదరి 
31. కల్యాణదుర్గం ఉమామహేశ్వరనాయుడు 
32. కదిరి కందికుంట వెంకటప్రసాద్‌ 
33. తంబళ్లపల్లె శంకర్‌ యాదవ్‌ 
34. సత్యవేడు జేడీ రాజశేఖర్‌ 
35. గంగాధరనెల్లూరు హరికృష్ణ 
36. పూతలపట్టు తెర్లాం పూర్ణం

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.