close
ప్రపంచంలోనే పే...ద్ద విమానం

తొలిసారి గగన విహారం

విమానం పేరు: స్ట్రాటోలాంచ్‌
వెడల్పు: ఫుట్‌బాల్‌ మైదానం కన్నా ఎక్కువ.
రెక్కల విస్తీర్ణం: 117 మీటర్లు.
ఇంజిన్లు: ఆరు, రెండు బాడీలు
తొలిసారి: స్ట్రాటోలాంచ్‌కు ఇప్పటివరకూ నేల మీదే పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా శనివారం   అమెరికాలోని మొజావీ ఎడారిపై ఇది గగనవిహారం చేసింది.
ప్రయోజనం: స్ట్రాటోలాంచ్‌ ఎగిరే లాంచ్‌ ప్యాడ్‌గా ఉపయోగపడుతుంది. కక్ష్యలోకి చౌకగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు.

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విమానం మొట్టమొదటిసారిగా గగనవిహారం చేసింది. ‘స్ట్రాటోలాంచ్‌’ అనే లోహ విహంగం అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి బయలుదేరింది. ప్రయోగం అద్భుతంగా సాగిందని విమాన పైలట్‌ ఎవాన్‌ థామస్‌ తెలిపారు.

ఎందుకు?
కక్ష్యలోకి చౌకలో ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఈ విమానాన్ని రూపొందించారు. ఉపగ్రహ  ప్రయోగాల కోసం భూమి నుంచి నిట్టనిలువుగా నింగిలోకి దూసుకెళ్లే రాకెట్లను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.
* స్ట్రాటోలాంచ్‌ ఎగిరే లాంచ్‌ ప్యాడ్‌గా ఉపయోగపడుతుంది. ఇది ఉపగ్రహంతో కూడిన రాకెట్‌ను మోసుకొని నింగిలోకి మోసుకెళుతుంది. అందుకోసం లాంచ్‌ ప్యాడ్‌ అవసరంలేదు. పొడవైన రన్‌వే సరిపోతుంది.
* నేలమీద నుంచి 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక రాకెట్‌ను జారవిడిస్తుంది. ఆ వెంటనే అది ప్రజ్వలించి అంతరిక్షంలోకి దూసుకెళుతుంది. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడుతుంది.

రెండున్నర గంటలపాటు...
స్ట్రాటోలాంచ్‌కు ఇప్పటివరకూ నేల మీదే పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా శనివారం రెండున్నర గంటల పాటు మొజావీ ఎడారిపై అది గగనవిహారం చేసింది.
* ఈ సమయంలో ఈ విమానం గంటకు 304 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. 17వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది.

చౌక ప్రయోగాలపై కన్ను
చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే మార్కెట్‌లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ అలెన్‌ ఈ ప్రాజెక్టును చేపట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన మరణించాక ఈ సంస్థ భవిత అనిశ్చితిలో పడిపోయింది. బ్రిటన్‌కు చెందిన బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ కూడా ఇలాంటి అంతరిక్ష ప్రయోగ విమానాన్ని రూపొందించింది.

రెండు బాడీలు
* స్కేల్డ్‌ కాంపోజిట్స్‌ అనే ఇంజినీరింగ్‌ కంపెనీ ఈ భారీ విమానాన్ని నిర్మించింది. దీనికి రెండు బాడీలు ఉంటాయి.
* ఈ విమానం వెడల్పు ఫుట్‌బాల్‌ మైదానం కన్నా పెద్దగా ఉంటుంది. రెక్కల విస్తీర్ణం 117 మీటర్ల మేర ఉంది. ఎయిర్‌బస్‌ ఎ380 రెక్క విస్తీర్ణం 80 మీటర్ల కన్నా తక్కువే ఉంటుంది.
* దీనికి ఏకంగా ఆరు ఇంజిన్లు ఉంటాయి.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.