close
కొత్త అటవీ సర్కిళ్లు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా అటవీశాఖ సర్కిళ్లను పునర్‌ వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు 12 అటవీ సర్కిళ్లు ఉండగా.. తాజా నిర్ణయంతో ఏడు రెగ్యులర్‌ సర్కిళ్లు, రెండు ప్రత్యేక సర్కిళ్లకు కుదిస్తూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులిచ్చారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులను ప్రత్యేక సర్కిళ్లుగా అటవీశాఖ గుర్తించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కొత్త జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 ఆగస్టులో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగా అటవీశాఖ కూడా తన సర్కిళ్లలో మార్పులు చేసింది. అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రప్రభుత్వం అటవీ సర్కిళ్లను పునర్‌ వ్యవస్థీకరించింది.

కొత్త సర్కిళ్లు, వాటి పరిధిలోకి వచ్చే జిల్లాలు.
కాళేశ్వరం: కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు
బాసర: ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల
రాజన్న: కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి
భద్రాద్రి: భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ గ్రామీణ, పట్టణ
యాదాద్రి: సూర్యాపేట, నల్గొండ, యాదాద్రిభువనగిరి, జనగాం
చార్మినార్‌: మేడ్చల్‌మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి
జోగులాంబ: వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబగద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌
అమాబ్రాద్‌ టైగర్‌ రిజర్వు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ డివిజన్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా
కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు: కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ డివిజన్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూరు డివిజన్‌.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.