Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 118889
            [news_title_telugu_html] => 

జూన్‌ మొదటి వారంలోగా రైతుబంధు

[news_title_telugu] => జూన్‌ మొదటి వారంలోగా రైతుబంధు [news_title_english] => [news_short_description] => తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కింద రైతులకు నగదు బదిలీ ఈ నెలాఖరు లేదా జూన్‌ మొదటి వారంలో చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. రైతుబంధు కింద రైతులకు ఇచ్చే మొత్తం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే బదిలీ చేస్తామని వివరించారు... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/9HjuMpxx6og [news_videoinfo] => https://www.youtube.com/embed/9HjuMpxx6og [news_sections] => ,27,26, ) )
జూన్‌ మొదటి వారంలోగా రైతుబంధు - EENADU
close
జూన్‌ మొదటి వారంలోగా రైతుబంధు

జీఎస్‌డీపీలో 15% వృద్ధిరేటు
సొంతరాబడుల్లో దేశంలోనే మిన్న
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకే రుణం
ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం రూ.1.64 లక్షల కోట్లు
రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కింద రైతులకు నగదు బదిలీ ఈ నెలాఖరు లేదా జూన్‌ మొదటి వారంలో చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. రైతుబంధు కింద రైతులకు ఇచ్చే మొత్తం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే బదిలీ చేస్తామని వివరించారు. రైతుబంధుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా మొదటి ఆరు నెలలకు రూ.6,000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు ఎలాంటి నిధుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఆసరా పింఛన్లకు అవసరమైన నిధులను ఓట్‌ఆన్‌అకౌంట్‌ బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. పాస్‌పుస్తకాలు ఉన్న 52 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం ఈ-కుబేర్‌ సాంకేతికత ద్వారా బ్యాంకుల సమస్యలు లేకుండా, నిధులు ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నామన్నారు. రుణమాఫీని నాలుగు దఫాలుగా అమలు చేయాలా? మరో విధానం అనుసరించాలా? అనే అంశంపై చర్చిస్తున్నామన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.9% వృద్ధి
తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 15% వృద్ధిరేటు నమోదైందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.8,66,875 కోట్లుగా కేంద్రం నిర్ధారించిందన్నారు. 2017-18 ఆర్థికసంవత్సరంలో ఇది రూ.7,52,804 కోట్లని పేర్కొన్నారు. రాష్ట్రం సొంతపన్నుల రాబడిలో 14.5% వృద్ధిరేటుతో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని, సొంత పన్నుల రాబడి రూ.64,716 కోట్లని వివరించారు.

పెట్టుబడి వ్యయంలో ముందున్నాం
రాష్ట్రం పెట్టుబడి వ్యయంలో ఇతర రాష్ట్రాలకంటే ముందుందని తెలిపారు. పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పెట్టుబడి వ్యయం కంటే గడిచిన ఐదేళ్లలో తెలంగాణలో చేసిన పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ పరిధిలో రూ.22,904 కోట్లు, బడ్జెట్‌ వెలుపల రూ.24,134 కోట్లు పెట్టుబడి వ్యయంగా ఉందన్నారు. ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం రూ.1.64 లక్షల కోట్లని వివరించారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు పొందేందుకు కనీస వయోపరిమితిని తగ్గించడం ద్వారా కొత్తగా ఏడు లక్షల మందికి పింఛన్లు అందనున్నాయన్నారు. గతంలో 39 లక్షల మంది ఆసరా పింఛనుదారులు ఉండగా, మొత్తం రూ.12 వేల కోట్లు ఆసరాకు అవసరమవుతాయన్నారు.

ద్రవ్య నియంత్రణ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం రుణాలను తీసుకుంటోందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం జీఎస్‌డీపీలో రుణాలు 25 శాతానికి మించకూడదని రాష్ట్ర ప్రభుత్వ రుణాలు 22 శాతంగా ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.29,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు సంబంధించి ఏటా రూ.3,000 కోట్ల చెల్లింపులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్పిన పెండింగ్‌ బిల్లులు రూ.3,474 కోట్లు ఉన్నాయని, జరుగుతున్న అభివృద్ధి పనులు, పెట్టుబడి వ్యయంతో పోలిస్తే బకాయిలు నామమాత్రమేనని అన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.