Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 120325
      [news_title_telugu_html] => 

నమో నమామి.. ఓట్ల సునామీ

[news_title_telugu] => నమో నమామి.. ఓట్ల సునామీ [news_title_english] => [news_short_description] => అఖిలభారతావని అనూహ్యమైన తీర్పు ఇచ్చింది. తూర్పు నుంచి పడమర వరకు.. ఒకటే గాలి వీచింది. సొంతంగానే ప్రభుత్వ 300 పైగా స్థానాల్లో భాజపా విజయదుందుభి మోగించి గతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. దక్షిణాదిన కొంత తగ్గినా కర్ణాటకలో పుంజుకుంది. చౌకీదారే ఇమాందారని భారతావని గట్టిగా గర్జించి మరీ చెప్పింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/FQsxMpMvHP8 [news_videoinfo] => |https://www.youtube.com/embed/FQsxMpMvHP8 [news_sections] => ,27,26, ) )
నమో నమామి.. ఓట్ల సునామీ - EENADU
close
నమో నమామి.. ఓట్ల సునామీ

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం
  కమలం ధాటికి కొట్టుకుపోయిన విపక్షాలు
  కమలనాథులకు ఒంటరిగానే 303 స్థానాలు!
  ఎన్డీఏ పక్షాలతో కలిసి 353 సీట్లు కైవసం
  52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ బలం
  కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి పరాభవం
  సత్తా చాటలేకపోయిన బీఎస్పీ-ఎస్పీ కూటమి
  తమిళనాడులో డీఎంకే.. ఏపీలో వైకాపా హవా

అఖిలభారతావని అనూహ్యమైన తీర్పు ఇచ్చింది. తూర్పు నుంచి పడమర వరకు.. ఒకటే గాలి వీచింది. సొంతంగానే ప్రభుత్వ 300 పైగా స్థానాల్లో భాజపా విజయదుందుభి మోగించి గతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. దక్షిణాదిన కొంత తగ్గినా కర్ణాటకలో పుంజుకుంది. చౌకీదారే ఇమాందారని భారతావని గట్టిగా గర్జించి మరీ చెప్పింది. శషబిషలకు తావులేకుండా.. మద్దతుదారులకు అవకాశం లేకుండా సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టింది. అటు ఈశాన్య భారతానా భాజపాదే హవా. ఐదేళ్ల తర్వాత మళ్లీ పీఠమెక్కాలని.. యూపీయే-3 నెలకొల్పాలని కలలుగన్న కాంగ్రెస్‌ ఆశలు మోదీ హవాలో కొట్టుకుపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో విజయఢంకా మోగించిన భాజపా బిహార్‌లోనూ విశ్వరూపం చూపింది. కమలదళం వ్యూహాలకు రాజకీయ దిగ్గజాలెన్నో పత్తాలేకుండా పోయాయి. కాంగ్రెస్‌లో ఉద్ధండులైన మల్లికార్జున్‌ ఖర్గే, వీరప్పమొయిలీ, సుశీల్‌కుమార్‌ షిండే, డిగ్గీ రాజా, రాహుల్‌ కిచెన్‌ క్యాబినెట్‌ సభ్యుడైన జ్యోతిరాదిత్య సింథియా తదితరులతో పాటు ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన రాహుల్‌ కూడా తన కంచుకోట అమేఠీలో ఓటమిపాలయ్యారు. తమిళనాడులో డీఎంకే హవా నడవగా.. తెలంగాణలో నాలుగింట జయభేరి మోగించిన భాజపా ఏపీలో మాత్రం ధరావతులు కోల్పోయింది. ఎన్నికల వ్యూహరచనల్లో ఆరితేరిన కమల దళపతి అమిత్‌షా నేతృత్వంలో అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 17 రాష్ట్రాల్లో ప్రత్యర్థులను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజీనామాకు సిద్ధపడుతుండడం ఈ ఎన్నికల్లో కొసమెరుపు.

దిల్లీ: హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ దశాబ్దంలోనే తిరుగులేని జన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిర్భవించారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచే భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని స్పష్టమయ్యింది. కాంగ్రెస్‌ కోటలు మూకుమ్మడిగా కమలనాథుల వశమయ్యాయి. వారణాసిలో 4.79లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో మోదీ, గాంధీనగర్‌లో 5.5లక్షలకు పైగా మెజార్టీతో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా విజయ పతాకను ఎగురవేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల నినాదం ‘చౌకీదారే చోరుడు’ను తిప్పికొట్టేలా ‘ఈ దఫా 300కి పైగా స్థానాలు సాధిస్తాం’ అంటూ తన ప్రసంగాల్లో హోరెత్తించిన ప్రధాని మోదీ చివరకు తన మాటను నిజం చేశారు. ఎన్‌డీఏ పక్షాలు గెలిచిన సీట్లనూ కలుపుకుంటే లోక్‌సభలో ఈ కూటమి బలం దాదాపు 350కి చేరుకునేలా ఉంది. 2014లో సాధించిన స్థానాలకు మించి భాజపా బలం పుంజుకుంది.

ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతుందంటూ విపక్షాలు ఎంతగా భాజపాపై విమర్శలు సంధించినా ఓటర్లపై ప్రభావం చూపలేదు. ప్రాంతాలు, కులాలు, వయస్సులు, లింగబేధాలకు అతీతంగా ఓటర్ల మనసును కమలనాథులు గెలుచుకున్నారని స్పష్టమవుతోంది. రాజకీయంగా అత్యంత సంక్లిష్టమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ-ఎస్పీ కూటమి పెనుసవాల్‌ విసిరినప్పటికీ, పలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి భాజపా ఫలితాలు సాధించింది. ఈ పరిణామం కమలదళ శ్రేణులను సైతం సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఆనందడోలికల్లో తేలియాడేలా చేసింది. భాజపాను రాష్ట్రంలో మట్టికరిపిస్తామనే ధీమాతో ఉన్న మహాకూటమిని నివ్వెరపడేలా చేసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కంచుకోట వంటి అమేఠీలోనూ ఆయనకు ఓటమి తప్పలేదు.

మోదీ ప్రభంజనం కేవలం ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్‌కే పరిమితం కాలేదు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కమలం పార్టీ దూసుకెళ్లింది. ఏ మాత్రం ఆశల్లేని తెలంగాణలోనూ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో మాత్రమే భాజపా విజయాలను నమోదు చేయలేకపోయింది. అయితే, జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీకి సవాల్‌ విసిరిన చంద్రబాబునాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో పరాజయంపాలైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రెండింటిలోనూ తెదేపా దారుణంగా దెబ్బతింది.

కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ భాజపా అనూహ్య విజయాలను నమోదుచేసింది. ఇక బిహార్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీల్లోనూ మోదీ-అమిత్‌ షా సేన అప్రతిహతంగా దూసుకెళ్లింది.

లోక్‌సభతో పాటు శాసనసభకూ ఎన్నికలు జరిగిన ఒడిశాలో భాజపా భారీ లబ్ధినే పొందగలిగింది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గాను 9ని సొంతం చేసుకుంది. అధికార బిజూజనతా దళ్‌(బిజద) గెలుపును 12 స్థానాలకే పరిమితం చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భాజపా ఖాతాలో చేరింది ఒకే ఒక స్థానం. మిగిలిన 20 స్థానాలనూ బిజదనే దక్కించుకుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజద అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. అదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొనసాగాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లు స్పష్టం అవుతోంది.
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చిన భాజపా ఏకంగా 18 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ను తన కంచుకోటలోనే 22 స్థానాలకు కట్టడి చేసింది.
‘విపక్షాలు ఎన్ని కథలు చెప్పినా ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్నే బలపరిచారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వానికి మోదీయే నేతృత్వం వహించాలని గట్టిగా కోరుకున్నారు’ అని భాజపాకు చెందిన అమిత్‌ మాలవియా అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తాజా రాజకీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి.

చరిత్రాత్మక విజయం: రాజ్‌నాథ్‌సింగ్‌
ఈ విజయం చరిత్రాత్మకం. ప్రధాని మోదీ నాయకత్వం, అమిత్‌షా సాహసోపేతమైన నిర్ణయాలు, లక్షలాది మంది భాజపా కార్యకర్తల కఠోరశ్రమతోనే ఇంతటి విజయం సొంతమైంది.

ప్రజలకు రుణపడి ఉన్నాం: సుష్మ
అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి వేనవేల అభినందనలు. ఇంతటి గెలుపును అందించిన ప్రజలకు రుణపడి ఉన్నాం.

భాజపాయే అత్యుత్తుమం: సురేశ్‌ ప్రభు
మోదీ హవా ఓ సునామీలా దేశాన్ని తాకింది. ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌ బీజేపీయే బెస్ట్‌ అనే మా నినాదాన్ని నిజం చేసింది. ఈ ఫలితాలు మోదీ పనితీరుకు, నాయకత్వ పటిమకు, నిరంతర శ్రమకు, దేశసేవకు ప్రజలిచ్చిన బహుమానం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.