close
అత్యధిక మెజార్టీ జగన్‌దే

ప్రత్యర్థికన్నా 90,110 ఓట్ల ఆధిక్యం
అత్యల్పంగా 25 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు విజయం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అత్యధికంగా 90,110 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణువర్ధన్‌ అత్యల్పంగా 25 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ ఆయనకు లభించిన అధిక్యం కంటే నోటాకు 41రెట్లు అధికంగా వచ్చాయి. నోటాకు మొత్తం 1,016 ఓట్లు వచ్చాయి. సీపీఎం, జనసేన, బీఎస్పీ కూటమి అభ్యర్థి బాబురావుకు 29,333 ఓట్లు లభించాయి. వెల్లడైన ఫలితాలను విశ్లేషించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

 

* 100 నుంచి 1000లోపు ఓట్లతో ముగ్గురు అభ్యర్థులు గెలిచారు. వారిలో వైకాపా, తెదేపా, జనసేన నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. తిరుపతి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డికి 708, రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావుకు 814, గన్నవరంలో తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ 838కి ఓట్ల అధిక్యం లభించింది.
* 3వేల లోపు పరంగా పరిశీలిస్తే... ప్రకాశం జిల్లా కొండెపి నుంచి తెదేపా అభ్యర్థి వీరాంజనేయస్వామి 1,024, పొన్నూరు నుంచి వైకాపా అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య 1,112, పర్చూరు నుంచి తెదేపా అభ్యర్థి వై.సాంబశివరావు 1,647, విశాఖపట్నం ఉత్తరం నుంచి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 1,944, నెల్లూరు నగరం నుంచి వైకాపా అభ్యర్థి అనిల్‌కుమార్‌ 1,988, ఉరవకొండ నుంచి తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ 2,132, తణుకు నుంచి వైకాపా అభ్యర్థి కె.వెంకటనాగేశ్వరరావు 2,195, నగరి నుంచి వైకాపా అభ్యర్థి ఆర్‌.కె.రోజా 2,708 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
* ఐదువేల లోపు ఆధిక్యంతో మొత్తం 21 మంది అభ్యర్థులు విజయం సాధింంచారు. వీరిలో 12 మంది వైకాపా, తెదేపా నుంచి 8 మంది, జనసేన నుంచి ఒక్కరు ఉన్నారు.
* ఈ ఎన్నికల్లో 50వేలకు పైగా ఆధిక్యం సాధించిన వారిలో జగన్‌ కాకుండా మరో అయిదుగురు వైకాపా అభ్యర్థులు ఉన్నారు. గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు 81,035, సూళ్లూరుపేట నుంచి కిల్లివెటి సంజీవయ్య 61,292, అనపర్తి నుంచి డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి 55,207, కడప నుంచి అంజాద్‌ బాషా 54,794, జమ్మలమడుగు నుంచి ఎం.సుధీర్‌రెడ్డి 51,641 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.