Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120952
            [news_title_telugu_html] => 

జులై నుంచి కాళేశ్వరం నీరు

[news_title_telugu] => జులై నుంచి కాళేశ్వరం నీరు [news_title_english] => [news_short_description] => ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జులై నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో వర్షాలు పడకున్నా ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఈ నీటిని మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం ద్వారా మధ్య మానేరు, [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/j1iI89pwass [news_videoinfo] => https://www.youtube.com/embed/j1iI89pwass [news_sections] => ,27,26, ) )
జులై నుంచి కాళేశ్వరం నీరు - EENADU
close
జులై నుంచి కాళేశ్వరం నీరు

కాల్వలన్నీ సిద్ధం కావాలి
యుద్ధప్రాతిపదికన మరమ్మతులను పూర్తిచేయండి
అధికారులు, ఇంజినీర్లతో సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం
ఈనాడు - హైదరాబాద్‌

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జులై నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో వర్షాలు పడకున్నా ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఈ నీటిని మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం ద్వారా మధ్య మానేరు, ఎల్లంపల్లికి అక్కడి నుంచి అటు శ్రీరాంసాగర్‌కు ఇటు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ వరకు నీరు పంపింగ్‌ అవుతుంది. ఇక్కడ వానలు కురవకున్నా చెరువుల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందుతాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్‌ వరకు అన్ని రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు నింపుతామని, ఆ జలాశయాల్లో గేట్లు, తూములు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పుడంటే అప్పుడు గేట్లు తెరిచేలా సిద్ధం చేయాలన్నారు. వరద కాల్వ, కాకతీయ, లక్ష్మీ, సరస్వతి, గుత్ప, అలీసాగర్‌ కాల్వలన్నింటినీ సిద్ధం చేసి, కాల్వల తూములు, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులను వచ్చే ఇరవై రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్యకార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, హరిరాం, సీఈలు ఖగేందర్‌, శంకర్‌లతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష నిర్వహించారు.

కాల్వల నిర్వహణకు సమగ్ర వ్యూహం
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఇకపై నిరంతర నీటి ప్రవాహం ఉంటుంది. దానికి తగినట్లుగానే కాల్వల నిర్వహణకు సమగ్ర వ్యూహం రూపొందించుకోవాలి. బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూములను నిర్వహించడానికి సర్వసన్నద్ధం కావాలి. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల ఇది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వలతోపాటు ఇతర కాల్వల్లో మూడు నాలుగేళ్లకోసారి మాత్రమే నామమాత్రంగా నీళ్లు వచ్చేవి. దీంతో నీటి ప్రవాహాన్ని పంట పొలాల వరకు తరలించేందుకు అనుగుణంగా కాల్వల నిర్వహణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్‌ వరకు అన్ని రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు నింపుతాం. ఆ జలాశయాల్లో గేట్లు, తూములు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి. మరమ్మతులను వచ్చే 20 రోజుల్లో పూర్తి చేయాలి. ఇందుకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తాం. నీటి మళ్లింపు పనులు పర్యవేక్షించేందుకు అవసరమైన లస్కర్లను నియమించుకోవాలి. కాల్వల్లో చివరి వరకు నీటి ప్రవాహానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను సన్నద్ధం చేయాలి. కాల్వల్లో పూర్తి సామర్థ్యంతో నీటి ప్రవాహం కొనసాగే వీలున్నందున వాటి ఒడ్డు పటిష్ఠంగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలి. దీనికోసం నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో కార్యశాల ఏర్పాటు చేసి ఒక విధానాన్ని ఖరారు చేయాలి.

పొలాలకు చేరే వరకు అప్రమత్తం
మేడిగడ్డ నుంచి నీటిని జలాశయాలకు తరలించే క్రమంలో కొన్ని బాలారిష్టాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలి. బ్యారేజీల నుంచి రిజర్వాయర్లు, చెరువులకు నీళ్లు పంపించే క్రమంలో ఎదురయ్యే చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవాలి. రిజర్వాయర్లకు నీరు చేరాక పొలాల చివరి వరకు చేరేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ పనులు నిర్వహించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.