Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120959
            [news_title_telugu_html] => 

శాసనసభాపక్ష నేతగా జగన్‌ ఎన్నిక నేడు

[news_title_telugu] => శాసనసభాపక్ష నేతగా జగన్‌ ఎన్నిక నేడు [news_title_english] => [news_short_description] => ప్రభుత్వ ఏర్పాటు దిశగా వైకాపా తొలి అడుగు వేస్తోంది. పార్టీ శాసనసభాపక్షం శనివారం ఉదయం 10:31 గంటలకు భేటీ కానుంది. శాసనసభాపక్ష నేతగా  జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/SaI6LgKFi5Y [news_videoinfo] => https://www.youtube.com/embed/SaI6LgKFi5Y [news_sections] => ,27,26, ) )
శాసనసభాపక్ష నేతగా జగన్‌ ఎన్నిక నేడు - EENADU
close
శాసనసభాపక్ష నేతగా జగన్‌ ఎన్నిక నేడు

ఉదయం 10:31 గంటలకు వైకాపా ఎమ్మెల్యేల సమావేశం
సాయంత్రం గవర్నర్‌తో వైకాపా అధినేత భేటీ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఏర్పాటు దిశగా వైకాపా తొలి అడుగు వేస్తోంది. పార్టీ శాసనసభాపక్షం శనివారం ఉదయం 10:31 గంటలకు భేటీ కానుంది. శాసనసభాపక్ష నేతగా  జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ ఒక్క అజెండాతోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. తాడేపల్లిలో జగన్‌ క్యాంపు కార్యాలయంలో జరగనున్న సమావేశంలో జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించనున్నారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు.ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేయనున్నారు. శాసనసభాపక్షం సమావేశమైన వెంటనే ఉదయం 11:30గంటలకు వైకాపా పార్లమెంటరీపార్టీ సమావేశం కానుంది. జగన్‌ నేతృత్వంలో జరగనున్నఈ భేటీలో పార్టీ పార్లమెంటరీపక్ష నేతను ఎన్నుకోనున్నారు.రెడ్డిలకు కాకుండా వేరే సామాజికవర్గానికి ఈ పదవిని కట్టబెట్టాలని జగన్‌ నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి. మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన వల్లభనేని బాలశౌరి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. విజయవాడలో30న జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు వేదికను శనివారం ఖరారు చేయనున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ను జగన్‌ కోరారు. ఆయన సమయం ఎప్పుడిస్తారనేది శనివారం తేలనుంది.

జగన్‌కు వేదాశీర్వచనాలు
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు శుక్రవారం జగన్‌ను కలిశారు. అర్చకులు వేదాశీర్వచనం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంనుంచి కూడా ఈవో కోటేశ్వరమ్మ, అర్చకులు వచ్చి జగన్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న జగన్‌ కార్యదర్శిగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ధనుంజయరెడ్డి పేరు ఖరారైంది. ఆయన గురువారం ఉదయంనుంచే జగన్‌ వెంట ఉన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, విశాఖ పోర్ట్‌ ట్రస్టు ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి రానున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పూనం మాలకొండయ్య, జేఎస్వీ ప్రసాద్‌, కరికాలవలవెన్‌ చంద్రబాబుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన సతీష్‌చంద్ర, జి.సాయిప్రసాద్‌, గిరిజాశంకర్‌, సంయుక్త కార్యదర్శి రాజమౌళి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌లు ఎస్‌ఎస్‌ రావత్‌, అజయ్‌జైన్‌, ముఖేష్‌కుమార్‌ మీనా, ఎం.రవిచంద్ర, అహ్మద్‌బాబు, సీనియర్‌ ఐపీఎస్‌లు సురేంద్రబాబు, అనూరాధ, ఇతర అధికారులు జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ ప్రధాన భద్రతా అధికారిగా (సీఎస్‌వో) ఏ.జోషి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీఎం భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. జగన్‌కు ప్రభుత్వం ప్రత్యేక వాహన శ్రేణి(కాన్వాయ్‌)ని కేటాయించింది. ఇందులో ఆరు స్ట్రామ్‌ వాహనాలున్నాయి. ఇందులో బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం ఉంది. జగన్‌కు జడ్‌ కేటగిరీ భద్రతను కల్పించామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.