Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 121012
            [news_title_telugu_html] => 

శిక్షణ కేంద్రంలో మంటలు

[news_title_telugu] => శిక్షణ కేంద్రంలో మంటలు [news_title_english] => [news_short_description] => కొందరు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటుండగా.. మరికొందరు నృత్యం తరగతులకు హాజరయ్యారు. ఇంతలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఏసీల నుంచి ఎగసిపడ్డ నిప్పురవ్వలు అగ్నికీలలుగా మారాయి. చూస్తుండగానే పైఅంతస్తులకు వ్యాపించాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/mZakhWcOPrw [news_videoinfo] => |https://www.youtube.com/embed/mZakhWcOPrw [news_sections] => ,27,26, ) )
శిక్షణ కేంద్రంలో మంటలు - EENADU
close
శిక్షణ కేంద్రంలో మంటలు

19 మంది విద్యార్థుల ఆహుతి
భవనం పైనుంచి దూకి తప్పించుకునే యత్నంలో కొందరి మృతి
సూరత్‌ కోచింగ్‌ సెంటర్‌లో విషాదం
18 మందిని కాపాడిన సిబ్బంది
ప్రమాదం జరిగినప్పుడు భవనంలో 50 మంది విద్యార్థులు
సూరత్‌

అది సూరత్‌లోని నాలుగంతస్తుల ఎత్తైన భవనం...
అందులో ఉన్నవారంతా ఇరవయ్యేళ్లలోపు వయసు యువతే.
కొందరు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటుండగా.. మరికొందరు నృత్యం తరగతులకు హాజరయ్యారు. ఇంతలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఏసీల నుంచి ఎగసిపడ్డ నిప్పురవ్వలు అగ్నికీలలుగా మారాయి. చూస్తుండగానే పైఅంతస్తులకు వ్యాపించాయి. దట్టంగా అలముకున్న పొగకు తోడు మంటలు వ్యాప్తి చెందడంతో యువతీయువకులంతా కకావికలయ్యారు. అక్కడే ఉంటే మంటలకు ఆహుతైపోవడం ఖాయమని భయపడ్డారు. సాహసం చేసి దూకేస్తే ప్రాణాలయినా దక్కుతాయని భావించారు. దీంతో కొందరు ప్రాణాలకు తెగించి రెండు, మూడు, నాలుగో అంతస్తుల నుంచి దూకేశారు. ఈ క్రమంలో తీవ్రగాయాల పాలై కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. మిగతావారు అక్కడే మంటలకు సజీవ దహనమయ్యారు. సూరత్‌లోని సర్తానాలో గల తక్షిల దుకాణ సముదాయంలో శుక్రవారం ఈ ఘోరం చోటుచేసుకుంది.

సూరత్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో ఎగసిపడిన మంటలకు 19 మంది టీనేజ్‌ విద్యార్థులు బలయ్యారు. ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌, డ్యాన్స్‌ క్లాస్‌కు వెళ్లిన 35 మందికిపైగా మంటల కారణంగా తరగతి గదుల్లో చిక్కుకుపోయారని సమాచారం. అగ్నిప్రమాదం జరిగినప్పుడు కనీసం 50 మంది విద్యార్థులు భవనంలో ఉన్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వీరిలో కనీసం పది మంది పైఅంతస్తుల నుంచి ప్రాణాలకు తెగించి కిందకు దూకేశారు. ఇందులో కొంతమంది చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని సూరత్‌ మున్సిపల్‌ వైద్యశాల- పరిశోధన సంస్థకు తరలించారు. మంటలను అదుపు చేయడానికి 19 అగ్నిమాపక వాహనాలను, రెండు హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫారాలను రంగంలోకి దింపారు. 18 మందిని సురక్షితంగా మంటల నుంచి బయటకు తీసుకురాగలిగారు. చల్లదనం కోసం ఏర్పాటు చేసిన ఏసీల్లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మొదలైన మంటలు క్రమేణా భవనం అంతా వ్యాపించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇద్దర్ని కాపాడిన యువకుడు
మంటలు ఎగసిపడటంతో నాలుగో అంతస్తులో ఉన్న ఓ యువకుడు సాహసం చేసి, కిటికీ గుండా మూడో అంతస్తు ఎడ్జ్‌పైకి క్షేమంగా చేరగలిగాడు. ఒక యువతిని కూడా అదేవిధంగా క్షేమంగా అదే ఎడ్జ్‌పైకి దింపాలని ప్రయత్నించాడు. ఆమె పట్టుతప్పి కిందకు పడిపోయింది. అయినా మరో ఇద్దరు యువతులను చాకచక్యంగా పట్టుకుని తనతోపాటే మూడో అంతస్తు ఎడ్జ్‌పైకి చేర్చగలిగాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ప్రమాదం జరిగిందిలా...
మొదటి అంతస్తులో మొదట మంటలు రాజుకున్నాయని, భయపడిన విద్యార్థులంతా నాలుగో అంతస్తులోకి వెళ్లిపోయారని అగ్నిమాపక అధికారి ఒకరు చెప్పారు. కొంతసేపటి తరువాత నాలుగో అంతస్తుకూ క్రమేణా మంటలు వ్యాపించాయన్నారు. అక్కడ ఎక్కువగా ఏసీలు, టైర్లు ఉండటంతో మంటలకు తోడు దట్టంగా పొగ అలముకుందని చెప్పారు. దీంతో విద్యార్థులంతా నాలుగో అంతస్తులో చిక్కుకుపోయారన్నారు. మంటలు చెలరేగితే ఆర్పడానికి భవనంలో ఎలాంటి ఏర్పాట్లు లేవని చెప్పారు. తాము రంగంలోకి దిగాక గంటలోనే మంటలను అదుపు చేయగలిగామన్నారు.

రూ.4 లక్షల పరిహారం
సంఘటన స్థలాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ సందర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు రూ.నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గల నగరాలు, పట్టణాల్లోని విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, ఆసుపత్రులు, దుకాణసముదాయాల్లో అగ్ని ప్రమాదాల సన్నద్ధతపై పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు అగ్నిమాపక ప్రమాదాలు జరిగితే తక్షణం నిరోధించడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయో, లేదో పరిశీలించేవరకు అన్ని కోచింగ్‌ సెంటర్లను మూసేయాలని అహ్మదాబాద్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాని మోదీ సంతాపం
దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచార వ్యక్తం చేశారు. బాధితులకు వీలైనంత సహాయం చేయాలని స్థానిక అధికారులను, ప్రభుత్వాన్ని ఆదేశించానని ట్వీట్‌ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీనడ్డా తదితరులు దుర్ఘటనపై తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.


 

సూరత్‌లో ఎన్ని అగ్ని ప్రమాదాలో..

2016 మే 7: సూరత్‌లో వస్త్రవ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉండే బస్ట్‌లింగ్‌ రింగ్‌ రోడ్‌ మార్కెట్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు.
2018 జనవరి 26: సూరత్‌లోని సర్గం షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం
2018 నవంబర్‌ 27: సూరత్‌లోని వేస ప్రాంతంలో దుకాణసముదాయంలో భారీ అగ్నిప్రమాదం. తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్పించిన అగ్నిమాపక సిబ్బంది
2019 మే 24: సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో నాలుగంతస్తుల భవనంలో ఉన్న శిక్షణ కేంద్రంలో చెలరేగిన మంటలు. 19 మంది మృతి.


 

విద్యార్థులను బలిగొన్న అగ్నిప్రమాదాలు

1995 డిసెంబర్‌ 23: హరియాణాలోని డబ్‌వాలీ రాజీవ్‌ కల్యాణ మండపంలో స్థానిక డీఏవీ పాఠశాల వార్షికోత్సవం నిర్వహిస్తుండగా ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుండగా టెంటు తగిలి జనరేటర్‌ షార్ట్‌సర్క్యూట్‌ అయి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 445 మంది సజీవదహనమయ్యారు. మరో 150 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
2004 జులై 16: తమిళనాడులోని కుంభకోణంలో సరస్వతీ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాఠశాల గదిలో పైకప్పునకు మంటలు అంటుకోవడంతో చిన్నారులు తరగతి గదుల్లోనే సజీవదహనమయ్యారు. ఈ దారుణ ఘటనలో 94 మంది విద్యార్థులు చనిపోయారు. ఇందులో 74 మంది నర్సరీ తరగతి పిల్లలే కావడం గమనార్హం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.