close
24 గంటల పాటు వైద్యసేవలు బంద్‌ 

17వ తేదీ ఉదయం 6 నుంచి 18న ఉదయం 6 గంటల వరకు 
ఐఎంఏ రాష్ట్ర శాఖ, టీహెచ్‌ఏఎన్‌ఏ వెల్లడి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కోల్‌కతాలో వైద్యుడిపై దాడికి నిరసనగా రాష్ట్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర శాఖ, తెలంగాణ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ (టీహెచ్‌ఏఎన్‌ఏ) సంయుక్తంగా ప్రకటించాయి. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.డి.ప్రతాప్‌రెడ్డి, టీహెచ్‌ఏఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి వై.రవీందర్‌రావులు మాట్లాడుతూ.. ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నీ బంద్‌ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా వైద్యులపై దాడులు పెరిగాయని పేర్కొంటూ రాష్ట్రంలో జరిగిన ఘటనలు గుర్తుచేశారు.  వైద్య విద్యలో అవినీతిని నిర్మూలించాలని, గ్రామ, పట్టణ, నగర స్థాయిని బట్టి ఆసుపత్రులను ఆధునికీకరించాలని ఎన్నికల ముందు అన్ని పార్టీలకు మెడికల్‌ మేనిఫెస్టో ఇచ్చినట్లు గుర్తుచేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వైద్యులకు వ్యతిరేకంగా మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టాలనుకుంటోందని.. వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బ్రిడ్జి కోర్సుల పేరుతో నర్సు, టెక్నీషియన్‌.. వైద్యుడిగా మారొచ్చని ప్రధాని మోదీ చెబుతున్నారు.. ఈ విషయంలో ఐఎంఏతో చర్చించి మార్పులు తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఐఎంఏ జాతీయ సభ్యులు డా.రవిశంకర్‌, ఈఎన్‌టీ వైద్యులు డా.ద్వారకానాథ్‌రెడ్డి, డా.సంపత్‌రావు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.