close
నేడే భారత్‌, పాక్‌ మహా సమరం

క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా అ‘టెన్షన్‌’ అయిపోయింది.. అభిమానుల దృష్టి అంతా ఆ మ్యాచ్‌ మీదే! ఈ కొన్ని గంటలు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అన్న ఆత్రుత పెరిగిపోతోంది. కారణం ప్రపంచకప్‌కే తలమానికమైన సమరం. భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ యుద్ధం. ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పోరు ఆదివారమే. మెగా టోర్నీలో దశాబ్దాలుగా చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్‌.. ఈసారి ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. 
ప్రత్యేకత: 2015 ప్రపంచకప్‌ తర్వాత ఈ రెండు జట్లు నాలుగుసార్లే తలపడ్డాయి. మూడింట్లో భారతే గెలిచింది. పుల్వామాలో ఉగ్రదాడుల తర్వాత ఈ దాయాది జట్లు పరస్పరం తలపడనుండటం ఇదే తొలిసారి.
ఇప్పటి వరకు: ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దయింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాక్‌.. ఒక మ్యాచ్‌లో గెలిచి, రెండింట్లో ఓడింది. ఒక మ్యాచ్‌ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.
వరుణుడు కరుణిస్తాడా!:  గత కొన్ని రోజులుగా మాంచెస్టర్‌లో చిరు జల్లులు పడుతున్నాయి. వాతావరణం మేఘావృతమై ఉంది. ఆదివారం వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశముంది.

131

ఈ రెండు జట్లు ఇప్పటిదాకా తలపడిన వన్డేలు. పాక్‌ 73 మ్యాచ్‌ల్లో గెలవగా, భారత్‌ 54 నెగ్గింది. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

6

ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ ఆడిన మ్యాచ్‌లు. ఈ ఆరింట్లోనూ టీమ్‌ఇండియానే గెలిచింది.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌  చేయండి

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.