close
15 మంది అధికారులకు ఉద్వాసన

అవినీతి ఆరోపణలు రావడంతో కేంద్రం చర్యలు
వైజాగ్‌ జీఎస్‌టీ జోన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌పైనా వేటు

దిల్లీ: అవినీతి, లంచగొండితనం అభియోగాలపై 15 మంది సీనియర్‌ కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారులను కేంద్రం ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. వీరిలో ప్రిన్సిపల్‌ కమిషనర్‌ నుంచి అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదా వరకూ పలువురు అధికారులు ఉన్నారు. ఈ జాబితాలో వైజాగ్‌ జీఎస్‌టీ జోన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజు శేఖర్‌ కూడా ఉన్నారు. వీరిలో కొందరిపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు పడిందని ఆర్థిక శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. వీరిపై అవినీతి, లంచగొండితనం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (సీ అండ్‌ సీఈ)కి చెందిన ఈ అధికారులను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి పదవీ విరమణ చేయిస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వీరికి మూడు నెలల వేతనం, భత్యాలను చెల్లించనున్నట్లు తెలిపింది. గత వారం అవినీతి, దొంగ సంతకాలు, వృత్తిపరమైన దుష్ప్రవర్తన వంటి అభియోగాలపై ఆదాయ పన్ను శాఖకు చెందిన 12 మంది అధికారులను ఉద్యోగాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. నలుగురు జాయింట్‌ కమిషనర్ల హోదాను డిప్యూటీ కమిషనర్‌ స్థాయికి తగ్గించింది.

‘ఇది కక్షసాధింపు’
ఉద్వాసనకు గురైన వారిలో ఉన్న అనూప్‌ శ్రీవాస్తవ.. దిల్లీలోని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డులో ప్రిన్సిపల్‌ ఏడీజీ (ఆడిట్‌)గా పనిచేశారు. ఆయన ప్రిన్సిపల్‌ కమిషనర్‌ హోదా అధికారి. వ్యక్తిగతంగా తనపై కక్ష కట్టిన రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే ఈ చర్యకు పూనుకున్నారని అనూప్‌ ఆరోపించారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలేనని చెప్పారు. కోర్టులు తనను నిర్దోషిగా ప్రకటించాయన్నారు. ‘‘చీఫ్‌ కమిషనర్‌గా నాకు పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన దస్త్రం విజిలెన్స్‌ పరిశీలన అనంతరం మా శాఖ నుంచి యూపీఎస్‌సీకి వెళ్లింది. 2018 డిసెంబర్‌ 20న శాఖాపరమైన పదోన్నతి కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని యూపీఎస్‌సీ నిర్ణయించింది. అయితే డిసెంబర్‌ 19న ఆ దస్త్రాన్ని పాండే వెనక్కి తెప్పించారు. ఇది దురుద్దేశంతో చేసిన కక్ష సాధింపు చర్య’’ అని ఆరోపించారు. తన సర్వీసు అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డుకు పాండే ఒత్తిడిని తట్టుకునే ధైర్యం లేకపోయిందని మండిపడ్డారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.