Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 136356
            [news_title_telugu_html] => 

కొత్త సభాపతి ఓం బిర్లా

[news_title_telugu] => కొత్త సభాపతి ఓం బిర్లా [news_title_english] => [news_short_description] => అనూహ్య నిర్ణయంతో భారతీయ జనతా పార్టీ అందర్నీ మరోసారి ఆశ్చర్యచకితుల్ని చేసింది. కనీసం పరిశీలనలో ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపించని వ్యక్తిని అకస్మాత్తుగా తెరపైకి తీసుకొచ్చింది. 17వ లోక్‌సభ స్పీకర్‌ పదవికి రాజస్థాన్‌లోని కోటా-బూంది లోక్‌సభ స్థానం... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/hBS3Yoi2jd8 [news_videoinfo] => |https://www.youtube.com/embed/hBS3Yoi2jd8 [news_sections] => ,27,26, ) )
కొత్త సభాపతి ఓం బిర్లా - EENADU
close
కొత్త సభాపతి ఓం బిర్లా

భాజపా అధిష్ఠానం అనూహ్య ఎంపిక
బలపరిచిన ఎన్డీఏ పక్షాలు, వైకాపా, తెదేపా..
మద్దతు పలికిన కాంగ్రెస్‌, తెరాస
లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఒకే ఒక నామినేషన్‌
నేడు లాంఛనంగా ఎన్నిక

ఈనాడు, దిల్లీ: అనూహ్య నిర్ణయంతో భారతీయ జనతా పార్టీ అందర్నీ మరోసారి ఆశ్చర్యచకితుల్ని చేసింది. కనీసం పరిశీలనలో ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపించని వ్యక్తిని అకస్మాత్తుగా తెరపైకి తీసుకొచ్చింది. 17వ లోక్‌సభ స్పీకర్‌ పదవికి రాజస్థాన్‌లోని కోటా-బూంది లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి గెలిచిన ఓం బిర్లా పేరును ఖరారు చేసింది. వ్యాపార సామాజిక వర్గానికి చెందిన 57 ఏళ్ల ఓం బిర్లా లోక్‌సభ సభ్యుడిగా మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే సభాపతి పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రతిపక్షాల నుంచి నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఓం బిర్లా ఎన్నికను బుధవారం లాంఛనంగా ప్రకటిస్తారు. ఆ వెంటనే ఆయన సభాపతి బాధ్యతలు స్వీకరిస్తారు.  లోక్‌సభ స్పీకర్‌ పదవి కోసం భాజపా అధిష్ఠానం మేనకాగాంధీ, వీరేంద్రకుమార్‌, ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, రమాదేవిలాంటి సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడినప్పటికీ ఎవరూ అనుకోని విధంగా ఓం బిర్లాను ఎంపిక చేసింది.

ఎన్నిక ఏకగ్రీవమే
ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరడంతో బిజూ జనతా దళ్‌, శివసేన, అకాలీదళ్‌, వైకాపా, తెదేపా, లోక్‌జనశక్తి, జేడీయూ, అన్నాడీఎంకే, అప్నాదళ్‌, నేషనల్‌ పీపుల్స్‌పార్టీ, మిజో నేషనల్‌ ఫ్రంట్‌లాంటి పార్టీలు నామినేషన్‌ను బలపరుస్తూ సంతకాలు చేశాయి. ఓం బిర్లా నామినేషన్‌ దాఖలు చేసే సమయానికి తెరాస ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో వారెవ్వరూ ఆ కార్యక్రమానికి హాజరు కానప్పటికీ మద్దతు తెలిపారు.

లోక్‌సభలో అతిపెద్ద విపక్షమైన కాంగ్రెస్‌ మాత్రం ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతుగా సంతకాలు చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అయితే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పక్షాలు కూడా ఓం బిర్లాకు మద్దతివ్వాలని ఆ తర్వాత నిర్ణయించాయి. ఇదే విషయాన్ని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్షనేతగా ఎంపికయిన అధీర్‌ రంజన్‌ చౌధరి ప్రకటించారు.

కొత్త తరానికి ప్రోత్సాహం
సాధారణంగా ఏడెనిమిదిసార్లు పార్లమెంటుకు ఎంపికైన సీనియర్లను సభాపతి పదవికి ఎంపిక చేస్తుంటారు. అయితే, భాజపా అధిష్ఠానం అనూహ్యంగా ఓం బిర్లాను ఎంపిక చేసింది. రెండు సార్లు రాష్ట్రంలోని 25కు 25 సీట్లను గెలిపించిన రాజస్థాన్‌కు కానుకగా సభాపతి పదవిని ఇవ్వడానికి భాజపా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగానూ భాజపా అధిష్ఠానం ఓం బిర్లా పేరును తెరమీదికి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఇదివరకు తెదేపా నేత జీఎంసీ బాలయోగి రెండోసారి, శివసేన నేత మనోహర్‌ జోషి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనప్పుడే సభాపతి పదవి వరించింది.

అమిత్‌షా, మోదీలకు సన్నిహితం
అజ్మేర్‌లోని ఎండీఎస్‌ యూనివర్సిటీ నుంచి ఎంకాం పట్టా పొందిన ఓం బిర్లా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1991 నుంచి 12 ఏళ్ల పాటు భారతీయ జనతా యువ మోర్చాలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాజస్థాన్‌ అసెంబ్లీకి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించినప్పుడు సహాయమంత్రి హోదాలో పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.

లోక్‌సభకు 2014లో తొలిసారి ఎన్నికయ్యారు. 2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. ఒకప్పుడు రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకి నమ్మకస్తుడిగా పేరుపొందిన ఆయన తదనంతర కాలంలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీలకు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరయ్యారు. ముంబయితో వ్యాపార సంబంధాలు, అహ్మదాబాద్‌తో బంధుత్వాలున్నాయి.
* గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారిలో అత్యధిక మంది వయస్సు 60-70 ఏళ్లు. ఓం బిర్లా వయస్సు 57.
* సభాపతులుగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కులు తెదేపా దివంగతనేత జీఎంసీ బాలయోగి. ఆయన 46 ఏళ్ల వయస్సులోనే ఈ బాధ్యతలు చేపట్టారు.
* 15, 16 లోక్‌సభ స్పీకర్లుగా వరుసగా మహిళలు మీరాకుమార్‌, సుమిత్రామహాజన్‌లు పనిచేశారు. ఇప్పటివరకూ స్పీకర్లుగా పనిచేసిన వారిలో బాలయోగి, మీరాకుమార్‌లు మాత్రమే దళితులు.
* ఇప్పటివరకూ పని చేసిన సభాపతుల్లో 10 మంది కాంగ్రెస్‌ వారు. భాజపా తరఫున ఆ బాధ్యతలు చేపట్టబోతున్న రెండో వ్యక్తి ఓం బిర్లా.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.