close
విత్తన భాండాగారంగా రాష్ట్రం 

నేటి నుంచి హైటెక్స్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు 
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విత్తన రంగానికి మహర్దశ పట్టనుందని.. ప్రపంచ విత్తన భాండాగారంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నుంచి హైటెక్స్‌లో ప్రారంభమవుతున్న అంతర్జాతీయ విత్తన సదస్సుకు పలు దేశాల నుంచి నిపుణులు హాజరవుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా), రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సు వల్ల తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ విత్తన మార్కెట్‌లోకి రాష్ట్ర విత్తనాలు సులభంగా ఎగుమతులు చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడేళ్లకోసారి నిర్వహించే ఈ సదస్సు ఆసియా దేశాల్లో జరగడం ఇదే తొలిసారని, అదీ మనదగ్గర జరుగుతుండటం విశేషమన్నారు. ఇస్టా ఆమోద ముద్ర పొందిన విత్తనాలు ప్రపంచ మార్కెట్‌లో సులభంగా అమ్ముకోవచ్చని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల మేలైన విత్తనాల ఉత్పత్తిలో అనుసరించాల్సిన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన తీరుపై ఇందులో రైతులకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. మొత్తం 80 దేశాల నుంచి 400 మంది విత్తన రంగ నిపుణులు హాజరవుతున్నారన్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపినట్లు మంత్రి చెప్పారు. 
బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉద్యోగులు కీలకం 
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొత్తగా నియమితులైన గ్రూపు వన్‌ సర్వీస్‌ అధికారుల రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా సర్వీసులో చేరిన అధికారులు విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరచాలంటే ఉన్నత విద్య సరిపోదని ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అనంతరం సమాచారహక్కు చట్టంపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ బి.పి.ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.