close
సాగు ఆగమాగం 

433 మండలాల్లో దుర్భిక్షం! 
వానల జాడ లేక వేసిన పంటలూ వాడుతున్నాయ్‌.. 
పత్తి బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించాలి 
కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ లేఖ 
ప్రత్యామ్నాయ పంటల సాగుకు సాయపడాలని కలెక్టర్లకు ఆదేశాలు

యాదాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మండలంలోనైనా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. సూర్యాపేట జిల్లాలో ఒకే ఒక్క మండలంలో సాధారణ వర్షాలు కురిశాయి. 
ఈనాడు, హైదరాబాద్‌: వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో కరవు ఛాయలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో 433 మండలాల్లో వర్షాభావం తీవ్రస్థాయికి చేరింది. తెలంగాణపై
నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. కారుమబ్బులు లేనందున సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి మరో 2 రోజులూ తేలికపాటి వర్షాలేనని వాతావరణ శాఖ తెలిపింది.  ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ కాలంలో పండే వంగడాలనే ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 
గత నెల ఒకటి నుంచి సోమవారం వరకూ రాష్ట్రస్థాయిలో సాధారణ వర్షపాతం 232.7 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 152.2 మి.మీ.లే కురిసింది. గత నెల(జూన్‌)లో వర్షపాతం లోటు 33 శాతముంటే ఈ నెలలో అది మరింత విస్తరించి 35కి పెరిగింది. 
కొన్ని మండలాల్లో వర్షపాతంలోటు 90 శాతానికిపైగా ఉంది. ఇది 60 శాతానికి మించితే కరవు ఉన్నట్లుగా భావిస్తారు. 
ఇప్పటికే 40 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వేసిన పైర్లు సైతం నీరు అందక వాడుముఖం పడుతున్నాయి. మరో వారం, పది రోజులు వర్షాలు లేకపోతే పంటలు చాలా వరకూ ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఉష్ణోగ్రతలు పైపైకి.. 
హైదరాబాద్‌లో సోమవారం పగటి ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4 డిగ్రీలు అధికంగా ఉంది. భద్రాచలంలో ఆదివారం రాత్రి 27.5 డిగ్రీలుంది. ఇది సాధారణంకన్నా 3.1 డిగ్రీలు ఎక్కువ. అధిక వేడికి గాలిలో తేమ తగ్గి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. 
ఇక ఆ పంటల సాగు వద్దు 
జులై మూడో వారం వచ్చినా ఇంతవరకూ వర్షాలు లేనందున పలు పంటల సాగు కాలం తీరిపోయింది. మినుము, పెసర, వేరుసెనగ, సోయాచిక్కుడు వంటి ప్రధాన పంటలను ఈ ఖరీఫ్‌లో ఇక సాగుచేయవద్దని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్‌ రైతులకు సూచించారు. వరిలోనూ తక్కువకాలంలో పండే వంగడాలకే నారు పోయాలన్నారు. ఈ నెలాఖరు వరకూ వర్షాలు లేకపోతే ఆగస్టులో నారు, నాట్ల జోలికి వెళ్లకుండా నేరుగా వరి విత్తనాలను చల్లే సాగు పద్ధతిని అనుసరించాలని చెప్పారు.

పత్తి ప్రీమియం గడువు పెంచాలి

రవు పరిస్థితుల వల్ల పంటల సాగు అంతంతమాత్రంగా ఉంది. పత్తి పంటకు బీమా చేయించడానికి ప్రీమియం చెల్లింపు గడువు సోమవారంతో ముగిసింది. వర్షాభావం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నందున గడువును ఈ నెల 23 వరకూ పొడిగించాలని కేంద్ర వ్యవసాయ శాఖకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సోమవారం లేఖ రాశారు. పొద్దుతిరుగుడు, ఆముదం, జొన్న వంటి పంటల సాగువైపు రైతులను మళ్లించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ మరో లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.