close
పుర పోరుకు సమాయత్తం 

నేడు మంత్రిమండలి సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నగరాలు, పట్టణాల్లో సుపరిపాలనకు ఉద్దేశించిన కొత్త పురపాలక చట్టం ముసాయిదా ఆమోదానికి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుంది. ఆ వెంటనే పురపాలక ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. మంత్రిమండలి భేటీలో పురపాలక చట్టం పూర్వాపరాలను సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు. కొత్త పురపాలక ముసాయిదాతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపైనా సీఎం చర్చించనున్నారు. రైతు రుణమాఫీ కమిషన్‌ చట్ట సవరణకు ఆమోదం తెలుపుతారు. పంచాయతీరాజ్‌ పాలకవర్గాల పదవీ బాధ్యతల స్వీకరణ తేదీలపై, జీఎస్టీ సవరణ, బోధన వైద్యుల వయోపరిమితి పెంపుపై జారీచేసిన ఆర్డినెన్స్‌లను ఆమోదిస్తారు. కొత్త శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని జలసౌధ స్థలాన్ని కూడా చేర్చే అంశంతో పాటు పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో అభివృద్ధి పనులు, ఇతర అంశాలను చర్చిస్తారు. ప్రబ్లిక్‌, ప్రయివేట్‌ భాగస్వామ్యంలో ఇళ్లు నిర్మించే కొత్త ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విధానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.