close
12 బిల్లులకు ఏపీ మంత్రిమండలి ఆమోదం

గ్రామ అభివృద్ధి ప్రణాళికల అమలుకు సచివాలయాలు
దేవాలయాల నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ- ఎసీ-్ట బీసీలకు 50%

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో శుక్రవారం నుంచి రోజూ ఒకటి లేదా రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 12 బిల్లుల వరకు ప్రవేశపెట్టనుంది. వీటికి సంబంధించిన ముసాయిదా బిల్లులపై గురువారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో మొత్తం 17 అజెండా అంశాలపై చర్చించారు. ఇందులో 12 ముసాయిదా బిల్లులు కాగా, మిగిలిన వాటిలో ఇప్పటికే జారీ అయిన జీవోలను ఆమోదించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల నియమకాలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గ్రామస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలుచేసేందుకు ఈ సచివాలయాలు దోహదపడతాయని అభిప్రాయపడింది. వాలంటీర్లకు నెలకు రూ.5వేల చొప్పున వేతనం చెల్లించేందుకు సమ్మతించింది. దేవాలయాల్లో నామినేటెడ్‌ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించేందుకు, ఈ కమిటీల్లో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల చట్టం-1987ను సవరిస్తూ సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుపై ఆమోదముద్ర వేసింది.

భూ యజమానుల యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారు 11 నెలలపాటు సాగు చేసుకునేందుకు ఒప్పందం చేసుకునేలా ముసాయిదా బిల్లును ఆమోదించింది. దీంతోపాటు రైతు భరోసా కింద రైతులకు ఇవ్వనున్న రూ12,500 పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసేందుకు అనుమతించింది.
* భూ వివాదాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చే క్రమంలో ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌-2019 సవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపింది.
* దశలవారీగా మద్యనిషేధ]ం అమలుకు తొలి అడుగుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఎక్సైజ్‌ చట్టం-1993 సవరణకు అనుమతించింది.
* అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7వేలు వంతున వేతనాల పెంపునకు  ఆమోదం తెలిపింది. పెంచిన జీతాలు జులై నెల నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.