close
వర్షాభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటాం

సమగ్రాభివృద్ధి కోసమే కొత్త పురపాలక చట్టం
గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌
మంచి చట్టం తెస్తున్నారని అభినందించిన గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు తెలిపారు. వచ్చే నెలరోజులు వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికోసం కొత్త పురపాలక చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. పురపాలనకు అవసరమైన అన్ని వనరులు, అధికారాలు, బాధ్యతలు కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధిÅకార యంత్రాంగం జవాబుదారీతనంతో వ్యవహరించేలా నిబంధనలు తెస్తున్నట్లు వెల్లడించారు. గురువారం రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు. శాసనసభ నుంచి నేరుగా గవర్నర్‌ వద్దకు చేరుకున్న సీఎం దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు.  రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సీఎం వివరించారు. కాళేశ్వరం కొంత ఆశాజనకంగా ఉందని, ఈ కొత్త ప్రాజెక్టులో 11 టీఎంసీల మేరకు గోదావరి జలాలను నిల్వ చేశామన్నారు. కొత్త పురపాలక చట్ట ముసాయిదా గురించి వివరించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలపై అధ్యయనం అనంతరం కొత్త చట్టం అవసరాన్ని గుర్తించి, దానిని నిపుణుల సాయంతో తయారు చేశామన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు చెల్లింపుల మొత్తాన్ని పెంచుతున్నామని, దీనివల్ల 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. మిషన్‌ భగీరథ, ఇతర కార్యక్రమాల పురోగతి గురించి వెల్లడించారు.

పారదర్శకంగా కొత్త చట్టం
కొత్త చట్టం ముసాయిదాను పరిశీలించిన గవర్నర్‌ దీనిపై సీఎంను అభినందించినట్లు తెలిసింది. కొత్త చట్టం పారదర్శకంగా ఉందని, ఆదర్శ పరిపాలనకు ఇది దోహదం చేస్తుందని ఆయన ప్రశంసించారు. హైదరాబాద్‌, ఇతర నగరాలలో వెంటనే దీనిని అమలు చేయాలని సూచించారు.

గవర్నర్‌తో సీబీఐ సంచాలకుని భేటీ
సీబీఐ సంచాలకుడు రిషికుమార్‌ శుక్లా గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. మర్యాదపూర్వక భేటీ అని అధికారవర్గాలు తెలిపాయి. బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ ఫ్రాంకోయిస్‌ గాటియర్‌ కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు.

గవర్నర్‌ కార్యాలయ సిబ్బంది బదిలీ
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కార్యాలయ సిబ్బంది విజయవాడకు బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడిగవర్నర్‌గా నరసింహన్‌ నియమితులయ్యాక ఏపీలోని సిబ్బందిని రాజ్‌భవన్‌లో నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌ను నియమించడంతో ఏపీ నుంచి వచ్చిన అధికారులను అమరావతికి పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు కార్యదర్శి, మీడియా కార్యదర్శి, ఇద్దరు విభాగాధిపతులు ఇతర సిబ్బంది ఇందులో ఉన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.