close
ఆగకుండా సాగిపోవచ్చు 

అన్నీ ఫాస్టాగ్‌ మార్గాలే! 
అది లేనివారి నుంచి టోల్‌ప్లాజాల వద్ద రెట్టింపు రుసుం వసూలు

దిల్లీ: వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు, రద్దీని నివారించేందుకు డిసెంబర్‌ 1 నుంచి జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద అన్ని వరసలను ఫాస్టాగ్‌ మార్గాలుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని టోల్‌ప్లాజాల్లో ఒక మార్గాన్ని మాత్రం హైబ్రిడ్‌ లేన్‌గా ప్రకటించి, భారీ వాహనాలకు అనుమతించాలని, అందులో ఫాస్టాగ్‌తోపాటు, ఇతర రూపాల్లో చెల్లింపులను స్వీకరించాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. అవసరమైతే సదరు మార్గం కూడా ఫాస్టాగ్‌ లేన్‌గా మారుతుందని వెల్లడించింది. డిసెంబర్‌ 1 తర్వాత ఫాస్టాగ్‌కు మాత్రమే అనుమతించే వరుసల గుండా వెళ్లే ఫాస్టాగ్‌యేతర వాహనదారుల నుంచి రెట్టింపు రుసుముల్ని వసూలు చేస్తారని పేర్కొంది. ప్రతి టోల్‌ప్లాజా వద్ద కొత్త రుసుము నిబంధనల్ని నిక్కచ్చిగా అమలయ్యేలా చూడాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు రాసిన లేఖలో మంత్రిత్వశాఖ పేర్కొంది. తాజా నిర్ణయం ఎలాంటి సమస్యలు లేకుండా అమలయ్యేందుకు దేశవ్యాప్తంగా అవసరమయ్యే ఫాస్టాగ్‌లను అంచనా వేసి, అవసరమైన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించింది. కొత్త విధానాన్ని అమలు చేసేందుకు డిసెంబర్‌ 1కన్నా ముందుగానే అన్ని టోల్‌ప్లాజాల వద్ద అవసరమయ్యే మానవ వనరులు, ఎలక్ట్రానిక్‌ మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని వివరించింది. ప్రస్తుతం ఫాస్టాగ్‌యేతర వాహనదారులు సైతం ఫాస్టాగ్‌ వరసల్లో వెళ్తూ, నగదు చెల్లింపులు చేస్తుండటంతో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.