Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 156889
            [news_title_telugu_html] => 

4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

[news_title_telugu] => 4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు [news_title_english] => [news_short_description] => దేశంలో నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఇందులో నలుగురు కొత్తవారు కాగా, ఇద్దరు వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. వీరిలో అయిదుగురికి రాజకీయ నేపథ్యం ఉండగా.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/wsnhNee8img [news_videoinfo] => |https://www.youtube.com/embed/wsnhNee8img [news_sections] => ,27,26, ) )
4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు - EENADU
close
4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

యూపీకి ఆనందీబెన్‌, ఎంపీకి లాల్‌జీ టాండన్‌ బదిలీ
పశ్చిమబెంగాల్‌, త్రిపుర, నాగాలాండ్‌, బిహార్‌లకు కొత్తవారు

ఈనాడు, దిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఇందులో నలుగురు కొత్తవారు కాగా, ఇద్దరు వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. వీరిలో అయిదుగురికి రాజకీయ నేపథ్యం ఉండగా.. ఒకరు మాజీ ఐపీఎస్‌ అధికారి. ఈనెల 15న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లకు, 16న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లకు కొత్త గవర్నర్లు నియమితులైన సంగతి తెలిసిందే. వీరితో కలిపి కొత్తగా నియమితులైన వారి సంఖ్య 10కి చేరింది. వచ్చే ఆగస్టులో ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోబోతున్న వారిలో గోవా, మహారాష్ట్ర గవర్నర్లు మృదులాసిన్హా, సీహెచ్‌.విద్యాసాగర్‌రావు ఉన్నారు. సెప్టెంబరులో కర్ణాటక, కేరళ, రాజస్థాన్‌ గవర్నర్లు వజుభాయి వాలా, జస్టిస్‌ పి.సదాశివం, కల్యాణ్‌సింగ్‌ల పదవీకాలం కూడా ముగియనుంది. తెలంగాణ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పదవీకాలం జూన్‌ 2తోనే ముగిసిపోయింది. త్వరలోనే వీరి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉండొచ్చని హోంశాఖ వర్గాలు తెలిపాయి.

తాజా నియామకాలు..

* పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా రాజస్థాన్‌ మాజీ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది జగ్‌దీప్‌ ధంఖడ్‌ నియమితులయ్యారు. 1990-91లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉపమంత్రిగా పనిచేసిన ఆయన 2003లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఇక్కడ గవర్నర్‌గా పనిచేస్తున్న కేశరీనాథ్‌ త్రిపాఠీ పదవీకాలం ఈనెల 24తో పూర్తికానుంది. కాగా కొత్త గవర్నర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విటర్‌లో స్వాగతం పలికారు.
* త్రిపుర గవర్నర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భాజపా సీనియర్‌ నేత రమేశ్‌ బైస్‌ నియమితులయ్యారు. 7 సార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన 5 సార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇక్కడ గవర్నర్‌గా ఉన్న కప్తాన్‌సింగ్‌ సోలంకి పదవీకాలం ఈనెల 27తో పూర్తికానుంది.
* బిహార్‌ గవర్నర్‌గా యూపీకి చెందిన భాజపా నేత ఫాగూ చౌహాన్‌ను కేంద్రం నియమించింది. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
* నాగాలాండ్‌కు ఇంటెలిజెన్స్‌ బ్యూరో విశ్రాంత ప్రత్యేక డైరెక్టర్‌ ఆర్‌ఎన్‌ రవి గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన 1976 కేరళ క్యాడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి. నాగా వేర్పాటువాద బృందం నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌తో జరిపిన చర్చల్లో ప్రభుత్వం తరుఫున మధ్యవర్తిగా వ్యవహరించారు. ఆ రాష్ట్ర పరిస్థితుల పట్ల ఆయనకు మెరుగైన అవగాహన ఉంది. ఇంతవరకు గవర్నర్‌గా ఉన్న పద్మనాభాచార్య ఐదేళ్ల పదవీకాలం ఈనెల 19తో పూర్తయింది.
* ఉత్తర్‌ప్రదేశ్‌కు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ను మార్పు చేశారు. యూపీ గవర్నర్‌గా పనిచేస్తున్న రామ్‌నాయక్‌ పదవీకాలం ఈనెల 22తో పూర్తికానుంది.
* మధ్యప్రదేశ్‌కు భాజపా సీనియర్‌ నేత, లాల్‌జీ టాండన్‌ను బదిలీ చేశారు. గత ఏడాది ఆగస్టు 23నే ఆయన బిహార్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. కొత్త గవర్నర్‌కు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అభినందనలు తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.