close
ద్వైపాక్షిక చర్చలతో పరిష్కారం కల్ల 

కశ్మీర్‌పై ట్రంప్‌ ప్రకటనను స్వాగతిస్తున్నా: ఇమ్రాన్‌ ఖాన్‌

వాషింగ్టన్‌: కశ్మీర్‌ వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ స్వాగతించారు. భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక చర్చలతో కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు లేనే లేవని పేర్కొన్నారు. 70 ఏళ్లుగా ఉపఖండాన్ని పీడిస్తున్న ఆ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించగల సామర్థ్యం శక్తిమంతమైన అమెరికాకు మాత్రమే ఉందన్నారు. వాషింగ్టన్‌లో మంగళవారం ఓ వార్తాసంస్థతో ఇమ్రాన్‌ మాట్లాడారు. ‘‘పాక్‌ అధ్యక్షుడిగా ముషారఫ్‌, భారత ప్రధానిగా వాజ్‌పేయీ ఉన్నప్పుడు కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి చాలా దగ్గరగా వచ్చాం. ఆ తర్వాత మళ్లీ అలాంటి సానుకూల పరిస్థితులు కనిపించలేదు. భారత్‌ చర్చలకు రావాలి. ఆ చర్చల్లో అమెరికా కీలక భూమిక పోషించగలదు. ట్రంప్‌ ఆ పని చేయగలరు’’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. భారత్‌ అణ్వాయుధాలను వదిలేస్తే తాము కూడా అణ్వస్త్రాలను త్యజిస్తామని ఆయన తెలిపారు. ట్రంప్‌ ప్రకటనపై భారత్‌ స్పందన తనకు ఆశ్చర్యం కలిగించిందని ఇమ్రాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.