Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176444
            [news_title_telugu_html] => 

నిబంధనల్ని విస్మరించిన జెన్‌కో

[news_title_telugu] => నిబంధనల్ని విస్మరించిన జెన్‌కో [news_title_english] => [news_short_description] => ‘పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు’ (పీహెచ్‌ఈపీ) పనుల ఒప్పందాన్ని ఏపీ జెన్‌కో రద్దు చేయడంమీద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ నవయుగ సంస్థ చేసిన అభ్యర్థనపై నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు వాయిదా వేసింది [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
నిబంధనల్ని విస్మరించిన జెన్‌కో - EENADU
close
నిబంధనల్ని విస్మరించిన జెన్‌కో

సంబంధం లేని కారణాలతో పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది
ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించిన నవయుగ
పనుల నిర్వహణలో ఆ సంస్థ వెనుకబడింది: ఏజీ
మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయం వాయిదా

ఈనాడు, అమరావతి: ‘పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు’ (పీహెచ్‌ఈపీ) పనుల ఒప్పందాన్ని ఏపీ జెన్‌కో రద్దు చేయడంమీద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ నవయుగ సంస్థ చేసిన అభ్యర్థనపై నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సంబంధం లేని కారణాలతో ఒప్పందాన్ని జెన్‌కో రద్దు చేసిందని, నిబంధనలను విస్మరించిందని నవయుగ తెలిపింది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని ప్రభుత్వం-జెన్‌కోల తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ పేర్కొన్నారు. ఉభయపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు.. ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేశారు. మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

కొనసాగిస్తే ఒప్పందం ప్రకారం పూర్తిచేస్తాం
పనులు చేపట్టాల్సిన ప్రాంతాన్ని ఇప్పటివరకు తమకు అప్పగించలేదని నవయుగ స్పష్టం చేసింది. తాజాగా పిలిచిన రీటెండర్‌లో విద్యుత్తు ప్రాజెక్ట్‌ పనుల పూర్తికి 58 నెలల గడువిచ్చారని, తమనే కొనసాగిస్తే ఒప్పందం ప్రకారం 2021 నవంబర్‌ నాటికి పూర్తిచేస్తామని తెలిపింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని, విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులను ఇతరులకు అప్పగించకుండా నిలువరించాలని, తమనే కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని నవయుగ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు. ‘సంబంధం లేని కారణాలతో ఒప్పందాన్ని రద్దు చేశారు. జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి జెన్‌కోతో 2017 డిసెంబర్‌ 20న ఒప్పందం చేసుకున్నాం. 2018లో నీటిపారుదల శాఖతో.. ‘ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌’కు ఒప్పందం చేసుకున్నాం. నిబంధనల మేరకే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లింపులు జరిగాయి. అంతకుమించి నయాపైసా చెల్లించలేదు. తీసుకున్న అడ్వాన్స్‌ సొమ్ముకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దానికి సమానమైన బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చాం. నిర్మాణ పనులు నిర్వహించాల్సిన ప్రాంతాన్ని అప్పగించాల్సిన బాధ్యత జెన్‌కోపై ఉంది. ప్రాంతాన్ని అప్పగించకుండా నిర్మాణం సాధ్యం కాదని సమాచారం ఇచ్చాం. నీటిపారుదల శాఖతో 2018 మే 28న రాళ్ల తవ్వకం ఒప్పందం చేసుకున్నాం. ఆ పని పూర్తి చేయడానికి మాకు ఆగస్టు 2019 వరకు గడువుంది. జులై 29నే ఒప్పందాన్ని రద్దు చేశారు. రాతి తవ్వకానికి అనుమతించకుండా ముందస్తుగానే కాంట్రాక్ట్‌ను రద్దు చేసి.. రాతి తవ్వకాన్ని పూర్తి చేయలేదని ఆరోపణ చేయడం తగదు’ అని స్పష్టం చేశారు.

ఆ రెండు ఒప్పందాలకు సంబంధం లేదు
‘నీటిపారుదల శాఖతో చేసుకున్న ఒప్పందానికి.. జెన్‌కోతో చేసుకున్న ఒప్పందానికి సంబంధం లేదు. ఏపీ జెన్‌కోకు, నవయుగకు మధ్య ఒప్పందం ఇది. ఈ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర సర్కారు మూడో పార్టీ మాత్రమే. కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జెన్‌కో మాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసింది. మేం ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదు. కాలపరిమితిని అధిగమించలేదు. మావైపు నుంచి ఎలాంటి లోపాలు లేవు. పనులు పూర్తి చేయడానికి 2021 నవంబర్‌ వరకు గడువుంది. పనులు నిర్వహించే ప్రాంతాన్ని అప్పగించడంలో జెన్‌కో విఫలమైన నేపథ్యంలో గడువు పొడిగించమని అడిగే వెసులుబాటు మాకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏపీజెన్‌కో ముందుగానే టెండర్లను రద్దుచేసింది. ఒప్పందాల్ని రద్దు చేయడానికి ఓ విధానం ఉంది. నోటీసులు ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి, అందుకు కొంత సమయం ఇవ్వాలి. ఇవేమి పాటించకుండా ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. రీటెండరింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపించడంలేదని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ.. రాష్ట్ర సర్కారుకు లేఖ రాసినా పట్టించుకోలేదు. రీ టెండరింగ్‌కు వెళ్లాలన్న ఉద్దేశంతో ఒప్పందాన్ని రద్దు చేశారు’ అని దమ్మాలపాటి తెలిపారు.

హైకోర్టులో వ్యాజ్యానికి వీల్లేదు: ఏజీ
బ్యాంక్‌ పూచీకత్తుగా ఉంచిన సొమ్మును నగదుగా మార్చుకోకుండా నిలువరించాలని అభ్యర్థిస్తూ విజయవాడ కోర్టులో నవయుగ సంస్థ మధ్యవర్తిత్వ దావాను దాఖలు చేసి ఉత్తర్వులు పొందిందని ఏజీ శ్రీరాô ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జిల్లా కోర్టును ఆశ్రయించిన పిటిషనర్‌ సంస్థ.. ఇదే అంశంతో ముడిపడిన వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పిటిషనర్‌ సంస్థ వెనకబడిందన్నారు. మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని కోరారు. ‘మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద నవయుగకు రూ.700 కోట్లకు పైగా చెల్లించాం. నీటిపారుదల పనులు చేపట్టేందుకు సమయం పడుతుందన్న కారణంగా జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేయడం తగదు. అడ్వాన్స్‌ తీసుకోవడం తప్ప నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. పని నిర్వహించాల్సిన ప్రాంతాన్ని అప్పగించలేదని జెన్‌కోపై ఆరోపణ చేస్తున్న పిటిషనర్‌ సంస్థ.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ విషయంలో తన బాధ్యతల్ని ఎందుకు నిర్వర్తించలేదు? ప్రాథమిక దశలోనే ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశం వారికి లేదు. పనుల్లో జాప్యంపై ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉంది. పిటిషనర్‌ సంస్థ పనుల నిర్వహించడంలో వెనుకబడిందని ఏపీ జెన్‌కోకు సమాచారం ఇచ్చింది మేమే. అందుకే రద్దు ఉత్తర్వులు జారీచేశారు. జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ విషయంలో ఇప్పటికే రీటెండరు పిలిచాం. ముందుకెళ్లనీయండి. పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేస్తాం, మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దు’ అని కోరారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.