Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176490
            [news_title_telugu_html] => 

తేనెటీగ...చావుకేక

[news_title_telugu] => తేనెటీగ...చావుకేక [news_title_english] => [news_short_description] => చిన్న కీటకమైన తేనెటీగ చనిపోతే ఏమవుతుందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ మనం వాతావరణాన్ని ఎంతగా విషతుల్యం చేసేస్తున్నామనేదానికి ఇదొక హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. తేనెటీగలు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,27, ) )
తేనెటీగ...చావుకేక - EENADU
close
తేనెటీగ...చావుకేక

తేనెటీగ.. పువ్వుఎగిరిపోయే ఈ చిన్న కీటకం మనుగడ ప్రమాదంలో పడింది. మానవాళి తప్పిదాలతో వీటి బతుకే గల్లంతవుతోంది.. ఆ వెనుకే మానవుడి మనుగడ కూడా..
ఝుమ్మంటూ ఎగరాల్సిన తేనెటీగలు ఉన్నట్టుండి నేల రాలిపోతున్నాయి. వందో రెండు వందలో కాదు.. లక్షలు.. కోట్లలో మూకుమ్మడిగా మృత్యువాత పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉండగా గత మూడు నెలల్లో బ్రెజిల్‌లో ఏకంగా 50 కోట్ల తేనెటీగలు నేలరాలిపోవడం ఆందోళనకరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విచ్చల విడిగా వాడుతున్న పురుగుమందులే దీనికి కారణమని బ్లూమ్‌బర్గ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు.

చిన్న కీటకమైన తేనెటీగ చనిపోతే ఏమవుతుందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ మనం వాతావరణాన్ని ఎంతగా విషతుల్యం చేసేస్తున్నామనేదానికి ఇదొక హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. తేనెటీగలు అంతరిస్తే ప్రపంచ ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పు వస్తుందని పేర్కొంటున్నారు. మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుందనడానికి ఇదో నిదర్శనమని చెబుతున్నారు. బ్రెజిల్‌ వ్యవసాయాధారిత దేశం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాదిరే బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనోరో వ్యాపారవర్గాల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. ట్రంప్‌లాగే ఆయన కూడా పర్యావరణపరమైన అంశాలంటే పెద్దగా గిట్టదు. గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో వెనుకబాటుతనం నెలకొనడంతో ఎరువులు, రసాయనాల వాడకానికి అనుమతుల అంశాన్నే ఆయన ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా చేసి గెలుపొందారు. ఎవరికి నచ్చిన రసాయనాలు, పురుగుమందులను వారు వాడుకునే స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పర్యావరణం ఘోరంగా దెబ్బతింటోంది. కొన్ని వందలమంది పురుగుమందుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఏడాది గడిచినా కోలుకోలేకపోతున్నారంటే వాటి తీవ్రత అర్థమవుతుంది. ప్రతీ ఆహార పదార్థంలోనూ రసాయనాల అవశేషాలు ఉంటున్నట్లు పలు పరీక్షల్లో తేలింది.

పరపరాగ సంపర్కం గురించి అందరికీ తెలిసిందే. ఏ పంట అయినా ఫలమైనా ఫలదీకరణ చెందాలంటే పరపరాగ సంపర్కం జరగాల్సిందే. ఈ క్రతువును నెరవేర్చేది కీటకాలే. వీటన్నింటిలోనూ తేనెటీగలదే ప్రధాన పాత్ర.

బ్రెజిల్‌లో ఏం జరిగింది?

బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా జైర్‌ బోల్స్‌నోరో ఎన్నికైన తర్వాత 290 రకాల పురుగుమందుల అమ్మకాలకు ఆమోదించారు. గత ఏడాదితో పోలిస్తే ఇవి 27 శాతం అధికం. అంతేకాదు వాటి తయారీలో అంతకు ముందు ఉన్న ప్రమాణాలను సడలించారు. కొత్త సంస్థలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల వాడకంలో ఆ దేశం ప్రపంచంలో మొదటి వరసలో ఉంటుంది. ఇప్పుడు ఈ విష రసాయనాల వాడకం మరింత పెరిగింది. 1990 నుంచి 2016 మధ్య 770 శాతం అధికమైదంటే పరిస్థితి అర్థమవుతుంది.
*పురుగుమందుల వాడకం వల్ల బ్రెజిల్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించగా 20% నమూనాల్లో రసాయనాల అవశేషాలు కనిపించాయి.
*బ్రెజిల్‌లో గ్లైఫోసేట్‌ రసాయనాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. కలుపు నివారణకు వినియోగించే ఈ మందును భారత్‌ సహా అనేక దేశాలు నిషేధించాయి.
*వ్యవసాయరంగంలో రసాయన మందుల వినియోగం కారణంగా 2018లో అస్వస్థతపాలైన బ్రెజిలియన్లు 15,018 మంది
*80 శాతం పంటల్లో పరపరాగ సంపర్కానికి తేనెటీగలే ఆధారం. వీటిని చంపుకోవడమంటే మన ఆహార భద్రతకు మనమే ముప్పు తెచ్చుకున్నట్లే!

-  ఆహార రంగ నిపుణులు

*ఒక తేనెటీగ 1 కేజీ తేనె సేకరించాలంటే భూమండలం చుట్టూ 6 సార్లు ప్రదక్షిణ చేసినంత దూరం తిరగాల్సి ఉంటుంది!

ఎందుకు వాడుతున్నారు?

జనాభా పెరుగుతుండడంతో ఆహారోత్పత్తికి కూడా డిమాండ్‌ పెరుగుతోంది. ఉత్పత్తిని పెంచుకోవాలంటే చీడపీడలతో పంట నష్టాలను తగ్గించుకోవడంపై రైతులు దృష్టిపెడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా పురుగుమందుల వాడకం పెరగడంతో చీడలకు నిరోధక శక్తి పెరుగుతోంది. ఫలితంగా మరింత ఎక్కువ మోతాదులో మందులను, సరికొత్త రకాలను వాడాల్సి వస్తోంది. అసలే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటుండగా.. దీనికి తోడు చీడపీడల కారణంగా 30 శాతం వరకు పంట నష్టం చవి చూడాల్సి వస్తోంది. ఇలాంటి కారణాల వల్లనే రైతులు పురుగుమందుల వాడకానికి మొగ్గుచూపుతున్నారు.

మనదేశంలోనూ అంతే!

* భారత్‌లోనూ పురుగుమందుల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. 2017లో మహారాష్ట్రలో వీటి కారణంగా 50 మంది రైతులు మృత్యువాత పడ్డారు.
* పత్తి ఎక్కువగా పండించే యావత్మల్‌ జిల్లాలోనే 19 మంది రైతులు చనిపోయినట్లు వెల్లడి కాగా ఆ ఏడాది 3 నెలల్లో 800 మంది రైతులు ఆసుపత్రుల పాలైనట్లు అధికారులు గుర్తించారు.

-ఈనాడు ప్రత్యేక విభాగం

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.